క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిన గవర్నర్, కేసీఆర్
తెలంగాణ గవర్నర్, సీఎం రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు.
తెలంగాణ గవర్నర్, సీఎం రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు.
గవర్నర్ మాట్లాడుతూ- "క్రిస్మస్, క్రీస్తు యొక్క సంతోషకరమైన జ్ఞాపకార్థ సమయం. యేసు ప్రపంచానికి బోధించిన ప్రేమ, సహనం, కరుణ బంధాలను పునరుద్ధరించడానికి ఇది ఒక సందర్భం. యేసు క్రీస్తు జీవితంతో ప్రేరణ చెంది విశ్వాసంతో ముందుకు సాగాలి. ఈ సందర్భంలో మనం మన క్రైస్తవ సహోదర సహోదరీలతో కలిసి మన లోకంలో శాంతి, సామరస్యాల కోసం ప్రార్ధించాలి" అన్నారు.
ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. ప్రేమ,కరుణ ద్వారా మానవాళిలో ఆనందం నింపిన ఏసుప్రభు జీవితం అందరికీ ఆదర్శప్రాయం అన్నారు. క్రిస్మస్ ను ప్రజలంతా సుఖశాంతులతో జరుపుకోవాలని సీఎం కోరారు.
క్రిస్మస్ ను పురస్కరించుకొని నిజాం గ్రౌండ్స్ లో ఈ నెల 22వ తేదీ క్రిస్టియన్లతో సీఎం కేసీఆర్ ములాఖత్ అయి వరాలు కురిపించారు. జెరూసలేం యాత్రకు వెళ్లే రాష్ట్ర క్రిస్టియన్ ప్రజలకు సబ్సిడీతో ఆర్థికసాయం చేస్తామని, క్రిస్టియన్ భవనం ఏర్పాటుచేస్తామని చెప్పిన విషయం విదితమే..!