Dharmapuri Arvind: అరవింద్ నివాసంపై దాడి.. తెలంగాణ డీజీపీకి గవర్నర్ ఆదేశాలు
Dharmapuri Arvind House Vandalised: ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసంపై దాడి చేసి విధ్వంసం సృష్టించి, కుటుంబసభ్యులు, సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడి, భయానక వాతావరణం సృష్టించిన తీరుపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు.
Dharmapuri Arvind House Vandalised: బీజేపి నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై దాడి ఘటనను తెలంగాణ గవర్నర్ తమిలిసై సౌందర రాజన్ తీవ్రంగా ఖండించారు. ఇంట్లో అద్దాలు ధ్వంసం చేయడం, వస్తువులను పగలగొట్టడం, కుటుంబ సభ్యులని బెదిరించడం చట్టరీత్యా నేరం అని అభిప్రాయపడిన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్.. ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి ఘటనపై తెలంగాణ డిజిపిని నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టు మీడియాకు తెలిపారు.
ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసంపై దాడి చేసి విధ్వంసం సృష్టించి, కుటుంబసభ్యులు, సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడి, భయానక వాతావరణం సృష్టించిన తీరుపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని తమిళిసై సౌందర రాజన్ దాడికి పాల్పడిన వారికి, దాడికి ఉసిగొల్పిన వారికి హితవు పలికారు.
మరోవైపు ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి ఘటన నేపథ్యంలో సహచర బీజేపి నేతల నుంచి ఆయనకు మద్దతు లభించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేరుగా ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పి ఈ ఘటనను ఖండించారు. భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ స్పందించారు. రాజకీయాలలో విమర్శలను ప్రతివిమర్శలతో ఎదుర్కోవాలి కాని ఇలా ఇంటిపై దాడి చేసి వారి తల్లిని భయభ్రాంతులకు గురి చేయటం అమానుషం అని హితవు పలికారు. ఇలాంటి దాడులపై ప్రతిఘటిస్తూ తిరిగి బిజేపి ప్రతిదాడులు చేస్తే టీఆర్ఎస్ నేతలు తట్టుకోగలరా అని టీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం, కేసిఆర్ ఎప్పుడూ బిసిలకు వ్యతిరేకమే అని ఈ దాడితో ప్రత్యక్షంగా రుజువైందని బూర నర్సయ్య గౌడ్ అభిప్రాయపడ్డారు.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఈ ఘటనపై స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో విమర్శలకు దీటుగా సమాధానం చెప్పాలి కానీ రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమే అవుతుందన్నారు. కేసీఆర్ ( CM KCR ) మార్గనిర్దేశంలో ప్రతిపక్ష నాయకుల ఇళ్లలోకి చొరబడి దాడులు చేసే పరిస్థితికి తెలంగాణ దిగజారడం అత్యంత శోచనీయం అని డికే అరుణ ఆవేదన వ్యక్తంచేశారు.
Also Read : Dharmapuri Aravind: బంజారాహిల్స్ పిఎస్‌లో కల్వకుంట్ల కవితపై ధర్మపురి అరవింద్ ఫిర్యాదు
Also Read : ఎంపీ అరవింద్ కుటుంబానికి ప్రాణహాని ఉంది.. ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు చేయాలి: డీకే అరుణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook