Tamilisai Soundararajan Fell Down: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ నడుస్తున్న సమయంలో కాలు జారి కిందపడిపోయారు. తమిళనాడులో నిర్వహించిన హైబ్రిడ్ రాకెట్ లాంచ్ ప్రయోగానికి హాజరవ్వగా.. ప్రసంగం అనంతరం కిందకు దిగి నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో తమిళసై కాలు జారి కిందపడ్డారు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై గవర్నర్‌ను పైకి లేపి నిల్చోబెట్టారు. ఒక్కసారిగా గవర్నర్‌ కాలు స్లిప్ అయి కిందపడడంతో ఏమైందోనని అక్కడ ఉన్నవారు కంగారు పడ్డారు. తిరిగి నడుచుకుంటూ వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాను కిందపడిపోయిన వార్త టీవీల్లో హైలెట్ అవుతుందని ఆమె సరదాగా అన్నారు. ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమం హైలెట్ అవుతుందో లేదో కానీ.. తాను కింద పడిపోవడం మాత్రం బిగ్ న్యూస్.. బ్రేకింగ్ న్యూస్‌ అవుతుందన్నారు. పక్కన ఉన్న వారు అందరూ నవ్వేశారు. అనంతరం గవర్నర్ కారు వద్దకు వచ్చి.. అక్కడి నుంచి బయలుదేరారు.   


 



దేశంలో మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ లాంచ్ ప్రయోగం తమిళనాడులోని మహాబలిపురంలోని పత్తిపులం గ్రామంలో ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జ్యోతి గవర్నర్ తమిళసై సౌందర రాజన్‌ చేసి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన  3,500 మంది విద్యార్థులు తయారు చేసిన 150 చిన్న సైజు ఉపగ్రహాలను ఇక్కడ ప్రయోగించారు. 


ఏపీజే అబ్దుల్‌కలాం స్టూడెంట్స్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ మిషన్‌-2023 పేరుతో ఈ వేడుకను నిర్వహించారు.   ఇస్రో శాస్త్రవేత్త మైలస్వామి అన్నాదురైతోపాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రూపొందించిన ఈ చిన్న సైజు శాటిలైట్స్.. వాతావరణంలో మార్పులు, రేడియేషన్ సమచారాన్ని సేకరించనున్నాయి. ఈ శాటిలైట్స్‌ను ప్రయోగించడంలో దేశంలో శాటిలైట్ల విప్లవం మొదలైందని అన్నారు ఇస్త్రో శాస్త్రవేత్త మైలస్వామి అన్నాదురై. పాఠశాల స్థాయిలోనే స్టూడెంట్స్‌ను ఇంజినీర్లు, శాస్త్రవేత్తలుగా, పలు రంగాల్లో ప్రావీణ్యం సంపాదించేలా తయారుచేయాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు.


Also Read: Cheteshwar Pujara: పుజారా కోసం రోహిత్ శర్మ వికెట్ త్యాగం.. వందో టెస్టులో ప్రత్యేకం  


Also Read: IND Vs AUS: ఆసీస్‌కు చుక్కలు చూపించిన జడేజా.. టీమిండియా సూపర్ విక్టరీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి