Mutual Transfers: తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్స్‌కు సర్కార్ గ్రీన్ సిగ్నల్..
Telangana govt allows Mutual transfers: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 317 పట్ల ఆందోళన చెందుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కాస్త ఊరటనిచ్చే వార్త ఇది. ప్రభుత్వం తాజాగా మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్స్‌కు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana govt allows Mutual transfers: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 317తో స్థానికత కోల్పోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త చెప్పింది. రాష్ట్రంలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల పరస్పర బదిలీ (Mutual Transfer)కి ప్రభుత్వం అనుమతినిచ్చింది. పరస్పర బదిలీ కోరుకునేవారు మార్చి 1 నుంచి 15 వరకు ఐఎఫ్ఎంఐఎస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జీవో 21 జారీ చేశారు.
ఒకే శాఖ, ఒకే హోదాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల మధ్యే పరస్పర బదిలీలు ఉండనున్నాయి. ఒకవేళ ఉపాధ్యాయులైతే.. ఒకే సబ్జెక్టు, ఒకే మీడియం, ఒకే కేటగిరీకి వారికి మాత్రమే పరస్పర బదిలీ అవకాశం ఉంటుంది. సీనియర్, జూనియర్ల మధ్య బదిలీలకు ఆస్కారం లేదు. జిల్లా పరిషత్ స్కూళ్లలో పనిచేసే బోధనేతర సిబ్బంది జిల్లా పరిషత్‌లోనే.. మండల పరిషత్ స్కూళ్లలో పనిచేసే సిబ్బంది మండల్ పరిషత్‌లోనే బదిలీ కోరే అవకాశం ఉంటుంది.
మరో ముఖ్య విషయమేంటంటే.. బదిలీ కోరేవారిలో ఒక్కరైనా కొత్త జోనల్ విధానం కింద బదిలీ అయి ఉండాలి. లేనిపక్షంలో పరస్పర బదిలీ దరఖాస్తును పరిగణలోకి తీసుకోరు. అలాగే బదిలీ జరిగేవారికి పాత సీనియారిటీ వర్తించదు. కొత్తగా ఎక్కడికైతే బదిలీ అవుతారో అక్కడ సీనియారిటీలో చివరి స్థానంలో ఉంటారు. పరస్పర బదిలీలకు ఎలాంటి టీఏ, డీఏలు వర్తించవు.
సస్పెన్షన్‌లో ఉన్నవారు, క్రమ శిక్షణ చర్యలు ఎదుర్కొంటున్నవారు, లాంగ్ పీరియడ్ గైర్హాజరులో ఉన్నవారు బదిలీలకు అనర్హులు. ఒక ఉద్యోగి ఒక దరఖాస్తును మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో పరస్పర బదిలీకి దరఖాస్తు చేసుకున్న తర్వాత.. ఆ కాపీలను జోనల్ పరిధిలోని హెచ్ఓడీలకు అందజేయాలి. వాటిని హెచ్ఓడీలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఆ ప్రతిపాదనలను ప్రభుత్వ (Telangana) కార్యదర్శికి పంపిస్తారు. అనంతరం బదిలీకి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తారు.
Also Read: Chalo Vijayawada: విజయవాడలో హైటెన్షన్.. అటు పోలీసుల అరెస్టులు, ఇటు ఉద్యోగుల దూకుడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook