Telangana Employees DA: ఎన్నో ఆశల్లో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వం నిరుత్సాహానికి గురి చేయగా.. ఒక డీఏ విడుదలకు ఆమోదం తెలపడంతో ఉద్యోగుల పరిస్థితి మోదం ఖేదం లాగా తయారైంది. కాగా విడుదల కానున్న ఒక డీఏపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు డీఏలు ఇవ్వాల్సి ఉండగా.. ఒక డీఏకు ఆమోదం తెలపడంపై కొందరు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తుంటే మరికొన్ని సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Telangana DA: ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ భారీ షాక్.. ఒకటే డీఏకు ఆమోదం


ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ మంజూరు చేయడంపై తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ (జేఏసీ) స్పందించింది. ప్రభుత్వం ఒక డీఏ విడుదల చేయడంపై జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. డీఏ మంజూరుపై ప్రభుత్వానికి కృత‌జ్ఙ‌త‌లు తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న డీఏల‌కు ఎట్ట‌కేల‌కు ప్ర‌భుత్వం ఓకే చెప్పడం శుభదాయకం అని చెప్పారు.

Also Read: MEIL Donation: బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌ పంచన చేరిన మేఘా కృష్ణారెడ్డి.. రూ.200 కోట్ల విరాళం


హైదరాబాద్‌లోని సచివాలయంలో శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో డీఏల చెల్లింపుపై ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడిన అనంతరం జేఏసీ చైర్మన్‌ స్పందించారు. ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ వి లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ఒకే డీఏ మంజూరు చేయడం సంతోషమే కానీ మిగ‌తా స‌మ‌స్య‌ల‌ను కూడా ద‌శ‌ల వారీగా ప‌రిష్క‌రించాల‌ని రేవంత్‌ రెడ్డిని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వంలో నాలుగు, ప్రస్తుత ప్రభుత్వంలో ఒకటి చొప్పున డీఏలు పెండింగ్‌ ఉన్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ఒక డీఏను ప్రభుత్వం ప్రకటించడంతో ఉద్యోగులకు కొంతమేర ఉపశమనం ఏర్పడిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మిగతా డీఎలను దశలవారీగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ, బదిలీలు తదితర అంశాలపై కూడా ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook