Telangana E Challan: పెండింగ్‌ వాహనాల చలాన్ల రాయితీ గడువును పోలీస్‌ శాఖ మరోసారి పొడిగించింది. జనవరి 31వ తేదీతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో గడువును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాయితీలతో పెండింగ్‌ చలాన్‌ల చెల్లింపు అవకాశాన్ని డిసెంబర్‌ 26వ తేదీ నుంచి అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మరో 15 రోజుల పాటు గడువును పొడిగించింది. ఇప్పుడు రెండోసారి గడువు తేదీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్‌ చలాన్లు ఉండగా.. ఇప్పటివరకు 1,52,47,864 మంది తమ చలాన్లు చెల్లించారు. అయితే ఇది మొత్తం 42.38 శాతం మాత్రమే ఉండడం గమనార్హం. చెల్లించిన చలాన్ల ద్వారా మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో రూ.135 కోట్ల ఆదాయం వచ్చింది. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో రూ.34 కోట్లు, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో రూ.25 కోట్లు, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో రూ.16 కోట్ల ఆదాయం సమకూరింది.


పెండింగ్‌ చలాన్లపై తెలంగాణ పోలీస్‌ శాఖ రాయితీ ఇచ్చిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్‌ 27వ తేదీ నుంచి రాయితీలతో చలాన్లు చెల్లించాలని నిర్ణయించింది. 15 రోజుల పాటు రాయితీలపై చెల్లింపులకు అవకాశం కల్పించింది. అయితే చలాన్ల చెల్లింపులు ఆశించినంత రాకపోవడంతో గడువు తేదీని పొడిగించారు. సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో జనవరి 31వ తేదీ వరకు పొడిగిస్తూ పోలీస్‌ శాఖ నిర్ణయం తీసుకుంది. పొడిగించిన తేదీ నాలుగు రోజుల్లో ముగియనుంది. చలాన్లు మీ సేవ, పేటీఎం, టీ వ్యాలెంట్‌, నెట్‌బ్యాకింగ్‌ ద్వారా చెల్లించాలని పోలీసులు సూచిస్తున్నారు. రెండు సార్లు గడువు పొడిగించినా కూడా వాహనదారుల నుంచి స్పందన నామమాత్రంగా కనిపిస్తోంది.


ముందుకు రాని వాహనదారులు
రాయితీలు కల్పిస్తున్నా వాహనదారులు ముందుకురావడం లేదు. రెండుసార్లు గడువు పొడిగించినా ప్రజలు చలాన్లు చెల్లించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈసారి చలాన్లు మొత్తం చెల్లించేలా పోలీస్‌ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోసారి గడువు పొడిగింపు ఉండదని వెంటనే చెల్లింపులు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. రాయితీల గడువు ముగిశాక చలాన్లపై ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. పెండింగ్‌ చలాన్లు ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని పోలీస్‌ వర్గాలు చెబుతున్నాయి. 


రాయితీలు ఇలా
ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80 శాతం, ఆర్టీసీ బస్సులు 90, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ ఇచ్చారు.

Also Read: Women Cheat Delhi Hotel: స్టార్‌ హోటల్‌లో మోసం చేయబోయి చిక్కిన తెలుగింటి మహిళ

Also Read: Love Proposal: ఇది 'ప్రేమ దోపిడీ'.. ఇతగాడి 'లవ్‌ ప్రపోజ్'‌ చూస్తే మీరు ప్రేమలో పడతారు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook