Praja Palana Dinotsavam: దశాబ్దాలు గడుస్తున్నా తెలంగాణలో సెప్టెంబర్‌ 17వ తేదీపై వివాదం రాజుకుంటూనే ఉంది. మరోసారి ఆరోజుపై తెలంగాణలో వివాదం మొదలైంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవంగా పరిగణిస్తుండగా.. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం 'తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం'గా ప్రకటించింది. ఆ రోజు ప్రజా పాలన దినోత్సవం పేరిట కార్యక్రమాలు నిర్వహించాలని అధికార యంత్రాగానికి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Ganesh Immersion: గణేశ్‌ నిమజ్జనంలో మద్యం, అమ్మాయిలపై ఈవ్‌టీజింగ్‌.. ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌


 


నిజాం పరిపాలన నుంచి తెలంగాణ రాష్ట్రం విముక్తి పొంది 1948 సెప్టెంబర్‌ 17వ తేదీన భారతదేశంలో విలీనమైంది. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవంగా ఉద్యమకారులు నిర్వహించారు. అయితే స్వరాష్ట్రం ఏర్పడిన అనంతరం కేసీఆర్‌ ప్రభుత్వం ఈ తేదీకి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. అయితే 2023లో కేంద్ర ప్రభుత్వం 'తెలంగాణ విమోచన దినోత్సవం' పేరిట అధికారికంగా సంబరాలు నిర్వహించింది. నాటి బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం తెలంగాణ విలీన దినోత్సవంగా ప్రకటించి ఏడాది పాటు సంబరాలు నిర్వహించింది.

Also Read: Telangana Elections: రేవంత్‌ సర్కార్‌కు భారీ షాక్‌.. తెలంగాణలో స్థానిక ఎన్నికలు వాయిదా?


 


ప్రస్తుతం అధికారంలోకి కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండింటికీ భిన్నంగా 'తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం'గా ప్రకటించింది. సెప్టెంబర్‌ 17వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండా ఆవిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సందర్భంగా అధికారికంగా జిల్లా స్థాయిలో జరిగే కార్యక్రమాల్లో జెండా ఎగురవేసే వారి పేర్ల జాబితాను ప్రభుత్వం వెల్లడించింది. కాగా అదే రోజు కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో విమోచన దినోత్సవం నిర్వహిస్తోంది.


జాతీయ జెండా ఎగురవేసేది వీరే..!


  • ఆదిలాబాద్‌- మహ్మద్‌ అలీ షబ్బీర్‌

  • భద్రాద్రి కొత్తగూడెం- తుమ్మల నాగేశ్వర్‌ రావు

  • హనుమకొండ- కొండా సురేఖ

  • జగిత్యాల- లక్ష్మణ్‌ కుమార్‌

  • జయశంకర్‌ భూపాలపల్లి- పోడెం వీరయ్య

  • జనగామ- బీర్ల అయిలయ్య

  • జోగులాంబ గద్వాల- ఏపీ జితేందర్‌ రెడ్డి

  • కామారెడ్డి- పటేల్‌ రమేశ్‌ రెడ్డి

  • కరీంనగర్‌- దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు

  • ఖమ్మం- భట్టి విక్రమార్క

  • కుమురం భీమ్‌ ఆసిఫాబాద్‌- రాంచందర్‌ నాయక్‌

  • మహబూబ్‌నగర్‌- జూపల్లి కృష్ణారావు

  • మంచిర్యాల- హరకర వేణుగోపాల్‌ రావు

  • మెదక్‌- కె కేశవరావు

  • మేడ్చల్‌- పట్నం మహేందర్‌ రెడ్డి

  • ములుగు- ధనసరి సీతక్క

  • నాగర్‌కర్నూల్‌- చిన్నారెడ్డి

  • నల్లగొండ- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

  • నారాయణపేట- గురునాథ్‌ రెడ్డి

  • నిర్మల్‌- సిరిసిల్ల రాజయ్య

  • నిజామాబాద్‌- అనిల్‌ ఈరవత్రి

  • పెద్దపల్లి- నేరెళ్ల శారద

  • రాజన్న సిరిసిల్ల- ఆది శ్రీనివాస్‌

  • రంగారెడ్డి- వేం నరేందర్‌ రెడ్డి

  • సంగారెడ్డి- దామోదర్‌ రాజనర్సింహ

  • సిద్దిపేట- ప్రభాకర్‌

  • సూర్యాపేట- ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

  • వికారాబాద్‌- ప్రసాద్‌ కుమార్‌

  • వనపత్తి- ప్రీతమ్‌

  • వరంగల్‌- శ్రీనివాస్‌ రెడ్డి

  • యాదాద్రి భువనగిరి- సుఖేందర్‌ రెడ్డి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.