దేశంలో తెలంగాణ 29వ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ జిల్లాలను 10 నుంచి 31వరకు పెంచిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు జిల్లాలు ఎక్కువ కావడంతో కొన్ని జిల్లాలను రద్దు చేసేలా టీ-సర్కార్ యోచిస్తోంది. ఆ జాబితాలో ముందు వరుసలో ఉంది వరంగల్ రూరల్ జిల్లా. జిల్లాను తొలగించినా ప్రజల నుండి పెద్దగా వ్యతిరేకత రాకపోవచ్చని ప్రభుత్వానికి నివేదికలు అందించాయట ఇంటలిజెన్స్ వర్గాలు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి వరంగల్ రూరల్ జిల్లా ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి ప్రజలుగానీ, ప్రజాప్రతినిధులు గానీ ఎవ్వరూ కోరలేదు. ఆది నుంచి ఈ జిల్లా ఏర్పాటుపై సందిగ్దత నెలకొంది. భౌగోళికంగా కూడా గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో వరంగల్ రూరల్ జిల్లాను రద్దు చేస్తే పెద్దగా వ్యతిరేకత రాకపోవచ్చని పలువురు నేతలు కేసీఆర్ కు చెప్పారట. 


ఒకవేళ జిల్లాల కుదింపు జరిగితే.. అందులో వరంగల్ రూరల్ జిల్లా ముందువరుసలో ఉంటుంది. అదే విధంగా ఇంకో జిల్లా జనగామ కూడా ఉంది. ఈ జిల్లాను ప్రజలు కోట్లాది మరీ తెచ్చుకున్నారు. ఇప్పటికే కలెక్టరేట్, తదితర జిల్లా స్థాయి భవనాల నిర్మాణం జరుగుతోంది. ప్రభుత్వం జనగాం జిల్లాను, యాదాద్రి భువనగిరి జిల్లాను కలిపి ఒక జిల్లా చేయాలనే ఆలోచన కూడా చేస్తోంది. కాగా.. ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి అందించిన నివేదికలో పెద్దపల్లి జిల్లా, మేడ్చల్ జిల్లా, నిర్మల్ జిల్లాలు కూడా ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఈ నివేదికలను పరిగణలోకి తీసుకుంటుందా?లేదా? అన్నది చూడాలి మరి...!