అదే చోట నందమూరి హరికృష్ణ స్మారకస్థూపం.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం
మహా ప్రస్థానంలో నందమూరి హరికృష్ణ స్మారక స్థూపం
ప్రముఖ సినీనటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. హరికృష్ణ పెద్ద కుమారుడు కళ్యాణ్ రామ్ తండ్రి చితికి నిప్పంటించారు. నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు జరిపించిన జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో నందమూరి హరికృష్ణ పేరిట ఓ స్మారక స్థూపం ఏర్పాటు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేసింది. నందమూరి హరికృష్ణ స్మారక స్థూపం కోసం 450 గజాల స్థలం కేటాయిస్తామని తెలంగాణ సర్కార్ తరపున సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ స్మారక స్థూపం నిర్మాణం మొదలు ఖర్చులన్నీ తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తేల్చిచెప్పారు.