Ayushman Bharat Scheme: ఎట్టకేలకు ఆయుష్మాన్ భారత్కి ఓకే చెప్పిన తెలంగాణ సర్కారు
Telangana govt to implement Ayushman Bharat Scheme: హైదరాబాద్: కేంద్రం అమలు చేస్తోన్న ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరనున్నట్లు తెలంగాణ సర్కార్ స్పష్టంచేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జాతీయ ఆరోగ్య శాఖతో ఎంవోయూ(MoU)పై సంతకాలు చేసింది.
Telangana govt to implement Ayushman Bharat Scheme: హైదరాబాద్: కేంద్రం అమలు చేస్తోన్న ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరనున్నట్లు తెలంగాణ సర్కార్ స్పష్టంచేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జాతీయ ఆరోగ్య శాఖతో ఎంవోయూ(MoU)పై సంతకాలు చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయం ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే ఈ ఒప్పందంపై సంతకం చేసినట్టు సీఎంవో తమ ట్వీట్‌లో పేర్కొంది.
తదనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఖారారు చేసిందని.., ఆ ప్రకారమే నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో వైద్య సేవలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సీఎం ఆదేశించినట్టు సీఎంఓ వెల్లడించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.ఎ.ఎం. రిజ్వీ, రాష్ట్ర ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈఓకు అమలుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసినట్టు తెలంగాణ సీఎంఓ తెలిపింది.