Tula Gold: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇచ్చిన హామీ ప్రకారం త్వరలోనే కుల గణన చేపట్టడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం కుల గణన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. కుల గణనకు అవసరమైన  చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాష్ట్ర సచివాలయంలో శనివారం బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ విభాగాలపై  రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ శాఖల అధికారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వసతిగృహాలు, సంక్షేమ గురుకుల పాఠశాలలపై సమీక్ష చేశారు. రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని కోరారు. సొంత భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, భవనాల నిర్మాణానికి స్థలాలు గుర్తించాలని ఆదేశించారు.

సంక్షేమ వసతిగృహాలపై దృష్టి
ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థులకు ఇచ్చే డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు, వంట బిల్లులు పెండింగ్ లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా  చెల్లింపులు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. జ్యోతిబాపూలే ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ను ఎక్కువ మంది అర్హులైన విద్యార్థులకు లబ్ధి కలిగేలా చూడాలన్నారు. విదేశాల్లో ఉన్న విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్‌ల ఆధారంగా ప్రముఖ విశ్వవిద్యాలయాలను గుర్తించి ఫ్రేమ్ వర్క్ తయారు చేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలన్నీ వేర్వేరు చోట్ల విడివిడిగా కాకుండా ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు.


నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటేడ్ హబ్ నిర్మించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఎక్కువ మంది విద్యార్థులు ఒకే ప్రాంగణంలో చదువుకుంటే విద్యార్థుల్లో ప్రతిభా పాటవాలు పెరుగుతాయని, పోటీతత్వం పెరుగుతుందని తెలిపారు. వెంటనే అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎడ్యుకేషన్ హబ్ ల నిర్మాణానికి సరిపడే స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. ఇప్పటికే 20 ఎకరాలకుపైగా విస్తీర్ణం ఉన్న స్కూల్ ప్రాంగణాల్లో మిగతా భవనాలు నిర్మించి హబ్‌గా తీర్చిదిద్దే అవకాశాలను పరిశీలించాలన్నారు. వీటికి కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు.


సంక్షేమ వసతిగృహాల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అవసరమైన సామగ్రిని సీఎస్ఆర్ ద్వారా నిధులు సమీకరించాలని సీఎం అధికారులకు సూచించారు. కల్యాణమస్తు, షాదీ ముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు అంచనాలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. బీసీ స్టడీ సర్కిళ్లను ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం  యూనిట్‌గా ఏర్పాటు చేసే అంశంపై అధ్యయనం చేయాలని చెప్పారు.

Also Read: Governor Protest: నడిరోడ్డుపై కుర్చీ వేసుకుని గవర్నర్‌ ధర్నా.. మీరెందుకు అంటూ పోలీసులపై ఆగ్రహం

Also Read: Amit Shah Tour Cancelled: అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు.. 'బిహార్‌' పరిణామాలే కారణమా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook