TGPSC Group 1 Mains 2024: తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
TGPSC Group 1 Mains 2024: గ్రూప్ 1 అభ్యర్ధులకు కీలక గమనిక. మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల కానున్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/నుంచి హాల్ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం.
TGPSC Group 1 Mains 2024: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల అంటే అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. టీఎస్ పీఎస్సీ కాస్తా టీజీపీఎస్సీగా మారిన తరువాత జరుగుతున్న తొలి గ్రూప్ 1 పరీక్షలివి. ఈ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు జరగనున్నాయి. హాల్ టికెట్లు ఇవాళ్టి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఇవాళ్టి నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో ఆరు పేపర్లతో పాటు జనరల్ ఇంగ్లీషు పేపర్ రాయాల్సి ఉంటుంది. ప్రతి పేపర్ 150 మార్కులకు 3 గంటల వ్యవధిలో ఉంటుంది. రోజూ మద్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఉంటుంది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఇవాళ అక్టోబర్ 14 నుంచి అందుబాటులో ఉండనున్నాయి.
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఇదీ
అక్టోబర్ 21న జనరల్ ఇంగ్లీషు పరీక్ష ( అర్హత పరీక్ష)
అక్టోబర్ 22న పేపర్ 1 జనరల్ ఎస్సే
అక్టోబర్ 23న పేపర్ 2 హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ
అక్టోబర్ 24న పేపర్ 3 ఇండియన్ సొసైటీ, భారత రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్
అక్టోబర్ 25న పేపర్ 4 ఎకానమీ
అక్టోబర్ 26 పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ
అక్టోబర్ 27 పేపర్ 6 తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 9వ తేదీన నిర్వహించగా 3.02 లక్షలమంది హాజరయ్యారు. ఇందులో 31, 382 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అధికారిక వెబ్‌సైట్‌లో మోడల్ ఆన్సర్ బుక్‌లెట్స్ అందుబాటులో ఉన్నాయి. మెయిన్స్ పరీక్షను ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ భాషల్లో రాసే అవకాశముంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.