Group 1 Mains: అభ్యర్థులకు అలర్ట్.. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్‌లో కీలక మార్పు
Group 1 Mains Exams Timings Forward: తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అప్‌డేట్. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి టీజీపీఎస్సీ కీలక మార్పు చేసింది.
TGPSC Group 1 Mains: సుదీర్ఘ కాలం తర్వాత నిర్వహిస్తున్న గ్రూప్ 1 పోస్టుల భర్తీలో మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. గత ప్రభుత్వం నుంచి గ్రూప్ 1 పోస్టుల భర్తీలో అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా ఈ పోస్టుల భర్తీకి అడ్డంకులు నెలకొంటున్నాయి. ఇప్పటికే ఈ పోస్టుల భర్తీపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం మొండిగా ఉద్యోగాల భర్తీ చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే మరో కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. పరీక్ష సమయంలో మార్పు చేసింది.
Also Read: Phenyl Pour: విచిత్ర సంఘటన.. రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఫినాయిల్‌తో అభిషేకం
తెలంగాణ ప్రభుత్వం 563 పోస్టుల భర్తీ చేపట్టిన విషయం తెలిసిందే. జూన్ 9వ తేదీన ప్రిలిమ్స్ నిర్వహించింది. ఫలితాలు కూడా విడుదలవడంతో మెయిన్స్ నిర్వహించేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించే మెయిన్స్ పరీక్షలు నిర్వహించనుంది. అయితే పరీక్ష సమయంలో కమిషన్ మార్పులు చేసింది. గతంలో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. అయితే తాజాగా సమయ వేళలను సవరించింది. పరీక్ష సమయాన్ని ఒక అర్ధగంట ముందుకు జరిపింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read: Rain Alert: తెలంగాణలో మళ్లీ జోరుగా వర్షాలు.. 3 రోజులు ఎక్కడెక్కడ కురుస్తాయో తెలుసా?
గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ వివరాలు
మొత్తం పోస్టులు: 563
ప్రిలిమ్స్ తేదీ: జూన్ 9
మెయిన్స్ పరీక్షలు: మొత్తం ఏడు రోజులు. అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు
పరీక్ష సమయం: మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు
- తెలుగు, ఉర్దూ, ఆంగ్లం మూడు భాషల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు
మెయిన్స్ షెడ్యూల్ ఇదే
తేదీ పేపర్
అక్టోబర్ 21 జనరల్ ఇంగ్లీష్ (క్వాలిఫయింగ్ టెస్ట్)
22 పేపర్ 1 (జనరల్ ఎస్సే)
23 పేపర్ 2 (హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ)
23 పేపర్ 2 (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం అండ్ గవర్నెన్స్)
24 పేపర్ 3 (ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్)
25 పేపర్ 4 (జనరల్ ఎస్సే)
26 పేపర్ 5 (సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్‌ప్రిటేషన్)
27 పేపర్ 6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ)
యథావిధిగా మిగిలిన పరీక్షలు
గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2, 3 పోస్టుల భర్తీ కూడా చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే గ్రూప్ 2 పరీక్షలను ఇటీవల టీజీపీఎస్సీ వాయిదా వేసిన విషయం తెలిసింద. గ్రూప్ 2 పరీక్షలు ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సి ఉండగా.. డిసెంబర్‌కు వాయిదా పడ్డాయి. 783 పోస్టుల భర్తీ చేపట్టగా.. 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక 1,388 పోస్టుల గ్రూపు 3 ఉద్యోగాల భర్తీకి నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. వీటిని వాయిదా వేయకుండా యథావిధిగా నిర్వహిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter