Telangan High Court orders to Government: తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ (Omicron) వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకలపై ఆంక్షలు విధించాలని ఆదేశించింది. వేడుకల సందర్భంగా ప్రజలు ఒక్కచోట గుంపులుగా చేరకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. ఈ మేరకు రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని పేర్కొంది. ఒమిక్రాన్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో ఇప్పటివరకూ 38 ఒమిక్రాన్ కేసులు (Omicron cases in Telangana) నమోదయ్యాయి. ఇందులో 14 కేసులు బుధవారం (డిసెంబర్ 22) ఒక్కరోజే నమోదయ్యాయి. విదేశాల నుంచి తిరిగొస్తున్నవారికి శంషాబాద్ విమానాశ్రయంలోనే కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. ఇందులో పాజిటివ్‌గా తేలినవారి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపిస్తున్నారు. అలా ఇప్పటివరకూ విదేశాల నుంచి తిరిగొచ్చిన 9,381 మందికి కోవిడ్ టెస్టులు చేశారు. ఇందులో 63 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా... వీరిలో 38 మందికి ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. 


ఇక కోవిడ్ కేసుల విషయానికి వస్తే... బుధవారం (డిసెంబర్ 22) కొత్తగా మరో 183 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 91 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,80,074కి చేరింది. ఇప్పటివరకూ 6,72,447 మంది కోవిడ్ (Covid 19) నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,610 కోవిడ్ యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.


Also Read: ఆ తెలంగాణ గ్రామంలో సెల్ఫ్ లాక్‌డౌన్-ఒమిక్రాన్ కేసు బయటపడటంతో గ్రామస్తుల అలర్ట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook