COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో గురువారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 1,19,464 కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 1,492 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. యథావిధిగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోనే అత్యధికంగా 166 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత అత్యథికంగా ఖమ్మం జిల్లాలో 129, నల్గొండ జిల్లాలో 115 కొత్త కేసులు గుర్తించారు. తాజాగా నమోదైన కేసులుతో కలిపి ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,09,417 కు పెరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Covid19: కరోనా చిన్నారుల వైద్య విధానంపై కేంద్రం మార్గదర్శకాలు, ఆ మందులు వాడవద్దు


అదే సమయంలో 1,933 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా మరో 13 మంది కరోనాతో చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,534 మందికి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,521 కరోనా యాక్టివ్ కేసులు (COVID-19 cases) ఉన్నాయి. వీరిలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా మిగతా వారు ఇంటి వద్దే హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.


Also read : India COVID-19 Cases: అన్‌లాక్ ఎఫెక్ట్, ఇండియాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook