తెలంగాణలో 3,657 కరోనా యాక్టివ్ కేసులు
గత 24 గంటల్లో 31,054 మందికి కరోనా వైరక్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 137 మందికి కరోనా వైరల్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కొత్తగా 48 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 31,054 మందికి కరోనా వైరక్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 137 మందికి కరోనా వైరల్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కొత్తగా 48 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. రంగారెడ్డి జిల్లాలో 16, కరీంనగర్ జిల్లాలో 11, మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, వికారాబాద్, మెదక్, జోగులాంబ గద్వాల, జనగామ, ములుగు జిల్లాల్లో కొత్తగా ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.
ఇక గడిచిన 24 గంటల్లో 173 మంది కరోనా వైరస్ నయమై కోలుకోగా, మరొకరు కరోనాతో కన్నుమూశారు. దీంతో ఇప్పటివరకు కరోనావైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య 3,979కి పెరిగింది.
Also read : Vitamin E and Dry Fruits Benefits: విటమిన్ ఇ లేకపోతే ఆ రెండింటికీ ప్రమాదమే
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 6,74,318 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోద అయ్యాయి. 6 లక్షల 66 వేల 682 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3 వేల 657 మంది కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also read : Green Tea: గ్రీన్ టీ ఏయే వేళల్లో తీసుకోకూడదు, ఎలా వాడుకలో వచ్చింది
Also read : Foods to Avoid in the morning : ఉదయం వేళల్లో..తీసుకోని పదార్ధాలు ఏంటో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook