Covid-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో గత 24 గంటల్లో 97,236 కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 3,527 మందికి కరోనా సోకినట్టు తేలింది. అదే సమయంలో 3,982 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా మరో 19 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 3,226కి చేరింది. కొత్తగా నమోదైన కేసులలో యధావిధిగానే జీహెచ్ఎంసీ పరిధిలో (GHMC) అత్యధికంగా 519 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 218, ఖమ్మం జిల్లాలో 215, రంగారెడ్డి జిల్లాలో 207 కేసులు నమోదు కాగా అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ స్పష్టంచేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో రికవరీ రేటు 92.81 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,71,044 కి (COVID-19) చేరింది. వారిలో 5,30,025 మంది కరోనావైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 37,793 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 


Also read : Pfizer, Moderna and J&J vaccines: ఫైజర్, మొడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ల ఇంపోర్ట్‌పై కేంద్రం క్లారిటీ


మరోవైపు పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు (Black fungus cases) పెరుగుతుండగా, దేశంలో అక్కడక్కడ వైట్ ఫంగస్ కేసులు కూడా వెలుగు చూస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు జిల్లా వైద్య అధికారులను అప్రమత్తం చేసింది. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ లక్షణాలు (White fungus symptoms and treatment)  ఉన్న పేషెంట్స్‌ని గుర్తించినట్టయితే ఉన్నతాధికారులకు సమాచారం అందించాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసింది.


Also read: Covaxin vaccines: 4 కోట్ల కోవ్యాగ్జిన్ షాట్స్ మిస్ అయ్యాయా ? అవేమయ్యాయి ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook