కేంద్ర మంత్రితో భేటీ అయిన మంత్రి ఈటెల
కేంద్ర మంత్రితో భేటీ అయిన మంత్రి ఈటెల
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నేడు ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను కలిశారు. గతంలో తెలంగాణ సర్కార్ ఇచ్చిన పలు విన్నతులను మరోసారి పరిశీలించాల్సిందిగా మంత్రి ఈటెల రాజేందర్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిన వెంటనే వాటిని మంజూరు చేయాల్సిందిగా మంత్రి ఈటెల రాజేందర్ కోరారు. జిల్లా ఆసుపత్రులను మెడికల్ కాలేజీలుగా అభివృద్ధి చేయడం, కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రంలో ఉన్న ఆస్పత్రులను జిల్లా ఆసుపత్రి స్థాయికి మెరుగుపరచడం, మదర్ చైల్డ్ హెల్త్ సెంటర్ల ఏర్పాటు వంటి అంశాలు ఈ భేటీలో ప్రధానంగా చర్చకొచ్చినట్టు తెలుస్తోంది.
[[{"fid":"180366","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ఇవే కాకుండా రీజనల్ క్యాన్సర్ సెంటర్స్, కొత్త పిఎంఎస్‌ఎస్‌వై (ప్రధాన మంత్రి స్వాస్త్య సురక్ష యోజన) బ్లాక్‌ల ఏర్పాటుతోపాటు కేంద్రం అందిస్తున్న పలు పథకాల అమలుపై దృష్టిసారించాల్సిందిగా మంత్రి ఈటెల కేంద్ర మంత్రిని కోరినట్టు సమాచారం.