Telangana Rains: తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అంతేకాదు తెలంగాణలో  ఉరుములతో కూడిన వర్షాలతో పాటు బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలియజేసింది. అంతేకాదు గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని తెలియజేసింది. ఖమ్మం, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని పలు చోట్ల ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ రోజు  నాలుగు జిల్లాల్లో,  రేపు  ఆరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. నేడు ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు... కుమురంభీం -ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల,  వరంగల్, హనుమకొండ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు రేపు మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లిచ  ఆదిలాబాద్, కుమురంభీం-ఆసిఫాబాద్  జిల్లాల్లో అత్యంత భారీగా, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, జయశంకర్‌-భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా ప్రాంతాల్లో ఏకంగా 20 సెంటీ మీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశముందని అప్రమత్తం చేసింది. ఇవికాకుండా ఐదారు జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అంతేకాదు హైదరాబాద్ మహా నగరంలో నాల్గు రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.


ఈ సమయాల్లో ఒకేసారి వరద ముంచుకురావడం, రోడ్లు, లోలెవల్‌ వంతెనలు మునిగిపోవడం, కొట్టుకుపోవడం వంటి ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపింది. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోవచ్చని ఐఎండీ హెచ్చరించింది. ఇక భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం పెరిగుతూ పోతుంది. గోదావరి మట్టం 14 అడుగుల నుంచి 20 అడుగులకు పెరిగింది. ఖమ్మంలో పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు తెరవడంతో దిగువన వరద ప్రవాహంలో 30 మంది చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నిస్తోంది. హెలికాప్టర్‌ను రంగంలోకి దింపారు. వారందరినీ హెలికాప్టర్ ద్వారా లిఫ్ట్ చేసి అశ్వరావుపేట అగ్రికల్చర్ యూనివర్సిటీలో దింపే ప్రయత్నాల్లో ఉన్నారు.


ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..


ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి