తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు: హైకోర్టు విచారణ రేపటికి వాయిదా
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. మంగళవారం సాయంత్రం వరకు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయకూడదని ఎన్నికల కమిషన్‌ను న్యాయస్థానం ఆదేశించింది.
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. మంగళవారం సాయంత్రం వరకు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయకూడదని ఎన్నికల కమిషన్‌ను న్యాయస్థానం ఆదేశించింది. మున్సిపల్ నోటిఫికేషన్ లో నిబంధనలను పాటించడం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో సోమవారం విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఎన్నికల నియమావళిని, ఎన్నికలకు సంబంధించిన అంశాలను తన ముందు ఉంచాలని ఎన్నికల కమిషన్ ను రాష్ట్ర హైకోర్ట్ ఆదేశించింది. ఈ విచారణ ముగిసిన తర్వాతే మంగళవారం నోటిఫికేషన్ షెడ్యూల్ ను విడుదల చేయాలని న్యాయస్థానం పేర్కొంది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..