MLA Vanama Venkateswara Rao Disqualifies: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేసింది. 2018 ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి ఆయన ఎన్నిక చెల్లదని తెలిపింది. దీంతో రెండోస్థానంలో ఉన్న జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్  ఇచ్చారని కోర్టును జలగం వెంకట్రావు ఆశ్రయించగా.. ఈ మేరకు విచారించిన కోర్టు తాజాగా తీర్పును వెల్లడించింది. అనర్హుడిగా ప్రకటించి.. రూ.ఐదు లక్షల జరిమానా విధించింది. ఈసీకి తప్పుడు అఫిడవిట్ ఇచ్చినందుకు ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. 2018 ఎన్నికల్లో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును విజేతగా ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2018 అసెంబ్లీ ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. బీఆర్ఎస్ తరుఫున జలగం వెంకట్రావును బరిలో నిలబడ్డారు. 4,139 ఓట్ల తేడాతో వెంకట్రావుపై వనమా విజయం సాధించారు. బహుజన పార్టీ అభ్యర్థి అడవల్లి కృష్ణకు 5,520    ఓట్లు రాగా.. నోటాకు 1,103 ఓట్లు పడ్డాయి. ఇద్దరు అభ్యర్థుల మధ్య గెలుపునుకు ఈ ఓట్లు కీలక ప్రభావం చూపించాయి. 


వనమా ఎన్నికను సవాల్‌ చేస్తూ.. 2019లో జలగం వెంకట్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కోర్టుకు ఫిర్యాదు చేశారు. వనమాను అనర్హుడిగా ప్రకటించాలని కోర్టులో అప్పటి నుంచి పోరాడుతున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు ఆ తరువాత బీఆర్ఎస్‌ గూటికి చేరిపోయారు. జలగం వెంకట్రావు అదే పార్టీలోనే ఉన్నారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. జలగం వెంకట్రావు వాదనలతో ఏకీభవించింది. వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొంది. 


Also Read: Schools Colleges Bandh Today: రాష్ట్రంలో నేడు స్కూల్స్, కాలేజీలు బంద్.. కారణం ఇదే..!  


Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook