మే7న ఓయూలో నిర్వహించ తలపెట్టిన రాహుల్ గాంధీ సభకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. విద్యార్థులతో సమావేశం అయ్యేందుకు రాహుల్ గాంధీకి అనుమతి ఇవ్వాలని NSUI,కాంగ్రెస్ నేతలు వీసీని అనుమతి కోరగా  రాజకీయ పార్టీల సభలు,సమావేశాలకు అనుమతి ఇవ్వకూడదని గతంలో తీసుకున్న నిర్ణయాల మేరకు అనుమతి ఇవ్వడం లేదని ఓయూ వీసీ అనుమతి నిరాకరించారు. వీసీ వైఖరిని ఖండిస్తూ కాంగ్రెస్, NSUI  ఆందోళన చేపట్టింది.  ఆందోళన చేసిన విద్యార్థి నేతలను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఓయూలో పర్మిషన్ ఇవ్వకుంటే చంచల్ గూడ జైల్లో విద్యార్థులను రాహుల్ కలుస్తాడని అందుకు అనుమతి ఇవ్వాలని జైల్ అధికారులకు రేవంత్ రెడ్డి వినతి పత్రం కూడా ఇచ్చారు.  ప్రభుత్వం కావాలనే రాహుల్ గాంధీ  ఓయూ మీటింగ్ కు అనుమతి ఇవ్వడంలేదని  గాంధీభవన్ నుండి  ప్రగతి భవన్ ముట్టడికి  జగ్గారెడ్డి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


వీసీ అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు కాంగ్రెస్ నేతలు. కోర్టు  విచారణకు స్వీకరించడంతో   ఇరుపక్షాలు వాదనలు వినిపించారు.విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు రాహుల్ ఓయూకు వస్తున్నారని రాజకీయ సమావేశం కాదని కోర్టుకు తెలిపారు పిటీషినర్.ఉస్మానియా యూనివర్సిటీ లో MCA, MBA,M.COM, పరీక్షలు నడుస్తున్నాయన్న ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ సమావేశాలు నిర్వహిస్తే ఉస్మానియా యూనివర్సిటీ లో శాంతి భద్రతల సమస్యలు వస్తాయని  విసీ స్టాండింగ్ కౌన్సిల్ కోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు  వీసీ, స్టాండింగ్ కౌన్సిల్ వాదనలకు మొగ్గు చూపుతూ కాంగ్రెస్ నేతలు ధాఖలు చేసిన పిటీషన్ కొట్టి వేసింది.


 


Also Read: LIC IPO Opens: ప్రారంభమైన జంబో ఎల్ఐసీ ఐపీఓ


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.