Good News To Studnets: మీరు చదుతున్న యూనివర్శిటీ మీకు నచ్చడం లేదా.. సరైన మెటీరియల్ మీకు అందడం లేదా.. ఇతర యూనివర్శిటీలో మీకిష్టమైన కోర్సు చేయాలని ఉందా.. అయితే మీకో గుడ్ న్యూస్. విద్యార్థులకు తెలంగాణ ఉన్నత విద్యామండలి విద్యార్ధులకు శుభవార్త చెప్పింది. దేశంలో యూజీసీ అనుమతి ఉన్న ఏ యూనివర్శిటీ నుంచేనా నుంచైనా ఆన్‌లైన్‌లో చదువుకునే వెసులుబాటు కల్పించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుత విధానం ప్రకారం విద్యార్థి ఒక యూనివర్సిటీలో చేరితే.. కోర్సు పూర్తయ్యేవరకు అక్కడే చదవాల్సి ఉంటుంది. ఆ విశ్వ విద్యాలయంలో సరైన వసతులు లేకున్నా.. స్టడీ మెటరీయల్ అందుబాటులో లేకున్నా విద్యార్థి అక్కడే చదవాలి. దీంతో కొందరు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేసేది లేక తమ ఖర్మ ఇంతేనంటూ ఉన్న వసతులతోనే చదువు కొనసాగిస్తున్నారు. కాని తెలంగాణ ఉన్నత విద్యామండలి తాజా నిర్ణయంతో ఇకపై అలాంటి కష్టాలు దూరం కానున్నాయి. స్టూడెంట్ తాను చేరిన కోర్సులో ఏదైనా ఒక పేపర్‌ లేదా సబ్జెక్టును ఇతర యూనివర్సిటీల నుంచి  చదువుకొనే అవకాశం లభించనుంది. ఆన్ లైన్ తో పాటు డిస్టెన్స్ మూడ్ లోనూ ఈ అవకాశం విద్యార్థులకు ఉండనుంది.


2022-23  విద్యా సంవత్సరం నుంచే కొత్త విధానం అందుబాటులోకి రానుంది. దీని వల్ల చాలా ఉపయోగాలు ఉండనున్నాయి. ఉదాహరణకు ఏయూలో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, పొలిటికల్‌ సైన్స్‌ కోర్టులో చేరిన విద్యార్థికి... అక్కడి పొలిటికల్ సైన్స్ సబెక్ట్ బోధించే అద్యాపకులు నచ్చలేదు.. లేదా మెటిరీయల్ నచ్చలేదు. అయినా స్టూడెంట్ నిరాశ పడాల్సిన అవసరం లేదు. పొలిటికల్ సైన్స్ కోర్సును ఉస్మానియా యూనివర్శిటీ లేదా తనకు నచ్చిన దేశంలో మరే యూనివర్శిటి నుంచైనా ఆన్ లైన్ లో చదువుకోవచ్చు.ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులకు అడ్డుగోడలు తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొ ఆర్ లింబాద్రి చెప్పారు. ఒక యూనివర్సిటీలో చేరిన విద్యార్థి మరో వర్సిటీ నుంచి ఏదైనా ఒక సబ్జెక్టు చదువుకునే వీలు కల్పిస్తున్నామన్నారు. గతంలోనూ ఉన్నత విద్యలో కొత్త సంస్కరణలు తీసుకువచ్చామని తెలిపారు. 40 శాతం క్రెడిట్స్‌ ఇతర వర్సిటీల నుంచి చేసుకోవచ్చని యూజీసీ కూడా చెప్పిందని  ప్రొ ఆర్ లింబాద్రి వెల్లడించారు.


READ ALSO: Osmania University: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఓయూ.. ఆరుగురు అరెస్ట్


READ ALSO: Gemology: కెరీర్‌లో విజయం సాధించాలంటే.. ఈ రత్నాలను ధరించండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook