బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ హోంమంత్రి
బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ హోంమంత్రి
హైదరాబాద్: రాష్ట్ర హోంమంత్రిగా ఎమ్మెల్సీ మహమూద్ అలీ నేడు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్.. తనతోపాటే కేవలం మహ్మూద్ అలీని మాత్రమే కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించిన సంగతి తెలిసిందే. మహ్మూద్ అలీ హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులతో పాటు పలువురు పార్టీ అగ్రనేతలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం హోంమంత్రి మహ్మూద్ అలీ మీడియాతో మాట్లాడుతూ.. ''రాష్ట్రంలో నెలకొన్న ప్రశాంత వాతావరణం అలాగే కొనసాగేలా చూస్తానని, అదేవిధంగా ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరిగి భరోసా కలిగేలా ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పనిచేస్తామని'' అన్నారు.