Mothe Srilatha Shobhan Reddy Meets CM Revanth Reddy: సమ్మర్ కు ముందే తెలంగాణలో రాజకీయాలు హీట్ ను పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీలు నువ్వా ... నేనా.. అన్న విధంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇకమరోవైపు అసెంబ్లీ సమావేశాలు కూడా హట్ హట్ గా నడుస్తున్నాయి. కృష్ణానది జలాల విషయంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను ఏకీపారేస్తుంది. గత బీఆర్ఎస్ పాలకులు పట్టించుకోకపోవడం వల్లనే, ఏపీ సీఎం జగన్ మనకు రావాల్సిన నీళ్ల వాటాలను ఏపీకి తరించుకుపోతున్నారన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More:Sai Pallavi: అమీర్ ఖాన్ కొడుకుతో సాయిపల్లవి.. వైరల్ అవుతున్న ఫోటో


ఇక.. అసెంబ్లీలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణాప్రాజెక్టుపై వివాదంపై పవర్ పాయింగ్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ ట్విస్ట్ ఎదురైందని చెప్పవచ్చు. ఇప్పటికే  పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.  ఇప్పటికే.. బీఆర్‌ఎస్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా  ఫసీయోద్దీన్ కాంగ్రెస్ లోకి చేరిన విషయం తెలిసిందే.  


Read More: Cauliflower Batani Pulao: వేడి వేడి కాలీఫ్లవర్, బఠానీ పలావ్..తయారీ పద్ధతి సులభమే!


అదే విధంగా హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా సీఎంను కలవడం తీవ్ర చర్చకు దారితీసింది. హైదరాబాద్ బీఆర్ఎస్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ప్రస్తుతం రాజకీయాల్లో హట్ టాపిక్ గా మారింది. అయితే.. శ్రీలత భర్త సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు మేడిగట్ట ప్రాజెక్టును సందర్శించడానికి బస్సులో బయల్దేరిన విషయం తెలిసిందే. 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook