Raj Tarun Girl friend: తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి సర్కారు డ్రగ్స్ సరఫరా, మాదక ద్రవ్యాలను సరఫరా చేయడంపై ఉక్కుపాదం మోపారు. ఎక్కడ కూడా డ్రగ్స్ సరఫరా చేయకూడదని సీఎం ఇదివరకు పోలీసులకు ఆదేశించారు. అదే విధంగా దీనిలో పోలీసులకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛను కూడా ఇచ్చారు. ఇదిలా ఉండగా.. మరోసారి హైదరబాద్ లో డ్రగ్స్ వెలుగుచూసిన ఘటన తీవ్ర కలకలంగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎస్ఓటీ పోలీసుల ప్రకారం.. నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో లావణ్య అనే యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె  వద్ద నుంచి 4 గ్రాముల MDMA డ్రగ్స్ సీజ్ ఎస్ఓటీ అధికారులు సీజ్ చేశారు.


Read Also: Maharashtra: ఓయో రూమ్ లో షాకింగ్ ఘటన.. ప్రియురాలిని మాట్లాకుందామని పిలిచి.. ఆ తర్వాత..


గోవా నుంచి నగరానికి చేరుకున్నాక, పక్కా సమాచారం ప్రకారం పోలీసులు దాడులు చేశారు. ఈ క్రమంలో.. సదరు యువతి లావణ్య, టాలీవుడ్ యంగ్ హీరో ప్రియురాలిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ డ్రగ్స్ ఘటన వెలుగు చూడటంతో మరోసారి పోలీసులు అప్రమత్తమయ్యారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook