TS Inter first year hall tickets download link: హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు సమయం ఆసన్నమైంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారమే.. ఈ నెల 25 నుండి వచ్చే నెల 3వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రేపు మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులోకి రానున్నాయి. 


తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in నుండి విద్యార్థులు నేరుగా తమ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని ఇంటర్ బోర్డ్ అధికారులు తెలిపారు. అలాగే అడ్మిట్ కార్డుపై (TS inter first year admit card download) ఉన్న పేరు, ఫొటో, సబ్జెక్టు, సిగ్నేచర్ తదితర వివరాలలో ఏమైనా తప్పులు ఉంటే విద్యార్థులు తమ సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్, జిల్లా ఇంటర్ విద్యాధికారి దృష్టికి తీసుకు రావాలి అని అధికారులు సూచించారు.