TS Inter Results Date: ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేయడంతో తెలంగాణలో రిజల్ట్స్‌ కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఫలితాల వెల్లడికి  ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఈ నెల 23న రిజల్ట్స్‌ను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఏదైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే ఈ నెల 24న విడుదల చేయనున్నారు. ఈ నెల 25న జేఈఈ మెయిన్ ర్యాంకులు విడుదలవుతున్న నేపథ్యంలో 23 లేదా 24వ తేదీలోగా ఇంటర్ ఫలితాలను బోర్డు వెల్లడించనుంది. త్వరలోనే ఫలితాలపై అధికారిక ప్రకటన రానుంది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తయినట్లు తెలుస్తోంది. ఫస్టియర్, సెంకడియర్ రిజల్ట్స్‌ను ఒకేసారి విడుదల చేయనున్నారు. తెలంగాణలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Petrol Diesel Price Today: తగ్గిన ముడి చమురు ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయంటే?


తెలంగాణ ఇంటర్ పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. 4,78,527 మంది ఫస్టియర్ విద్యార్థులు, 4,43,993 మంది సెకండియర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 10వ తేదీ నుంచే మూల్యంకనం ప్రారంభించగా.. మొత్తం నాలుగు విడతల్లో పూర్తి చేశారు. మూల్యాంకనంలో ఎలాంటి తప్పులు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. గతంలో జరిగిన తప్పుల దృష్ట్యా సిబ్బందికి ముందే కీలక సూచనలు ఇచ్చారు. ఫలితాలను కంప్యూటికరీంచి.. ఫలితాలను విడుదల చేస్తారు. విద్యార్థులు రిలల్ట్స్‌ చెక్ చేసే సమయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తుగా చెక్ చేస్తున్నారు.


ఇక ఏపీ ఇంటర్ పరీక్షలు 9.99 లక్షల మంది రాశారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 67 శాతం మంది పాస్ అయ్యారు. ఏపీలో ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. సెకండియర్లో అమ్మాయిలు 81 శాతం, అబ్బాయిలు 75 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరంలో అమ్మాయిలు 71 శాతం, అబ్బాయిలు 64 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్, సెకండ్ ఇయర్లో ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఏపీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను మే 24 నుంచి జూన్ 1 మధ్య నిర్వహించనున్నారు. ఇంటర్ సప్లిమెంటరీ రాసే విద్యార్థులు నేటి నుంచి ఈ నెల 24 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫలితాలకు సంబంధించిన ఏమైనా అనుమానాలు ఉంటే ఈ 24వ తేదీ వరకు అధికారులు దృష్టికి తీసుకువెళ్లవచ్చు. ప్రాక్టికల్స్ మే 1 నుంచి 4 వరకు ఉంటాయన్నారు.


Also Read: 4th Phase Election Notification: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నోటికేషన్ విడుదల.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook