హైదరాబాద్‌ : తెలంగాణలో ఇంటర్మీడియెట్ ఫలితాల వెల్లడి అనంతరం తీవ్ర గందరగోళం చోటుచేసుకున్న నేపథ్యంలో ఇంటర్‌ రీ వెరిఫికేషన్‌ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని వుంది. ఈ నేపథ్యంలోనే ఇంటర్ ఫలితాల వెల్లడిపై దాఖలైన పిటిషన్ నేడు విచారణకు రాగా.. ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిందని.. రేపే ఈ ఫలితాలను ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు హై కోర్టుకు తెలిపింది. జవాబు పత్రాలను ఈ నెల 27న వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామని ఇంటర్ బోర్డు కోర్టుకు విన్నవించింది. 


అయితే, ఇంటర్ బోర్డు విజ్ఞప్తిపై స్పందించిన హై కోర్టు.. ఫలితాలు, జవాబు పత్రాలను ఈ నెల 27న ఒకేసారి వెల్లడించాలని బోర్డుకు సూచిస్తూ తదుపరి విచారణను జూన్‌ 6 కు వాయిదా వేసింది. అంతేకాకుండా ఇంటర్‌ ఫలితాల వివాదంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న గ్లోబరినా సంస్థకు హైకోర్ట్‌ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.