TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల వెల్లడికి తెలంగాణ విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పరీక్షా పత్రాల మూల్యాంకనం పూర్తవడంతో ఎన్నికల సంఘం అనుమతి కోసం నిరీక్షిస్తోంది. అనుమతి రాగానే ఏప్రిల్ 22వ తేదీన ఫలితాలు విడుదల చేయనుందని తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 19 వరకూ జరిగిన ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షలకు మొత్తం 10 లక్షలమంది విద్యార్ధులు హాజరయ్యారు. ఏప్రిల్ 10వ తేదీన పరీక్షా పత్రాల మూల్యాంకనం పూర్రయింది. ఆన్‌లైన్‌లో మార్కుల నమోదు ఇతర ప్రక్రియల్ని పూర్తి చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల సంఘం అనుమతి కోసం చూస్తున్నారు. ఇవాళ్టిలోగా అనుమతి రావచ్చని తెలుస్తోంది. అనుమతి లభించగానే ఏప్రిల్ 22వ తేదీ సోమవారం ఇంటర్ ఫలితాలు విడుదల చేయవచ్చు. ఒకవేళ ఏదైనా కారణంతో సాధ్యం కాకుంటే ఏప్రిల్ 23 మంగళవారం విడుదలవుతాయి. 


ఇంటర్ ఫలితాలు తెలుసుకునేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in ఓపెన్ చేయాలి. ఫలితాలు మొదటి ఏడాది లేదా రెండవ ఏడాదనేది ఎంచుకోవాలి. తురవాత హాల్ టికెట్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేస్తే చాలు ఇంటర్ మార్కులు స్క్రీన్‌పై ప్రత్యక్షమౌతాయి.


Also read: AP Summer Effect: మండుతున్న ఎండాకాలం, భయపెడుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook