హైదరాబాద్: మద్యం దుకాణాలు, బార్లు త్వరలోనే తెరుస్తారని.. మందుబాబుల కష్టాలు తీరబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు తెలంగాణలో మద్యం దొరకక చాలా జిల్లాల్లో కొందరు వ్యక్తులు పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ వదంతులపై స్పందించారు. మద్యం షాపులను లాక్‌డౌన్ గడువు ముగిసేవరకు తెరిచే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.  ఉద్యోగుల జీతాల్లో భారీగా కోత.. మార్చి నుంచే అమలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశమంతా ప్రాణాంతక కరోనా వైరస్‌తో పోరాడుతోందని, దీనిపై పోరాటంలో భాగంగా లాక్‌డౌన్ కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ సమయంలో వైన్స్, ఇతర మద్యం దుకాణాలు తెరవడం తగిన నిర్ణయం కాదని పేర్కొన్నారు. మద్యం దొరకక పిచ్చిక్కినట్లు ప్రవర్తిస్తున్న వారి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి చికిత్స అందిస్తామని చెప్పారు. మందు కోసం ఆగలేక, పిచ్చిపట్లినట్లుగా ప్రవర్తించే లక్షణాలు కనిపిస్తున్న వారు వెంటనే దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచించారు. కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్


కుటుంబంతో ప్రశాంతంగా గడిపే సమయం వచ్చినందుకు మందుబాబులు సంతోషించాలని, హాయిగా ఇంట్లో వారితో గేమ్స్ ఆడుతూ గడపాలని, కానీ మద్యం షాపులు ఎప్పుడు తెరుస్తారా అనే ఆలోచనలు మానుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం నేపథ్యంలో లాక్‌డాన్ గడువు ముగిసేవరకు మద్యం దుకాణాలపై ఆశలు వదులుకోవాలని సూచించారు. పొరుగురాష్ట్రాలకు చెందిన వలసకూలీలకు అధికారులు తగిన వసతులు ఏర్పాట్లు చేస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు


Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ


బుల్లితెర భామ టాప్ Bikini Photos


బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone