TS LPCET 2021 important dates: హైదరాబాద్: తెలంగాణలో ఎల్పీ సెట్ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఐటీఐ చదివి, పాలిటెక్నిక్ కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో అడ్మిషన్ కోరుకునే విద్యార్థులు ఈ ఎల్పీ సెట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి కమిషనర్ నవీన్ మిట్టల్ (Navin Mittal) తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గడువు ముగిసేలోగా దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులకు వంద రూపాయలు లేట్ ఫీజుతో ఈనెల 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు. ఇటీవల కాలంలో కరోనావరస్ సెకండ్ వేవ్ (covid-19) కాస్త తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ నోటిఫికేషన్ విడుదల చేశామని చెప్పిన నవీన్ మిట్టల్.. పరీక్ష నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. 


Also read: TS EAMCET 2021: మరోసారి టిఎస్ ఎంసెట్ ఎగ్జామ్స్ దరఖాస్తు గడువు పెంపు


తెలంగాణ ఎల్పీ సెట్ 2021 నోటిఫికేషన్‌కి (TS LPCET 2021 Notification) సంబంధించిన పూర్తి వివరాలు కోసం అధికారిక వెబ్‌సైట్   sbtet.telangana.gov.in లోకి లాగిన్ అయి నోటిఫికేషన్ కాపీని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా నవీన్ మిట్టల్ సూచించారు.
Also read: TS inter second year exams cancelled: తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దుపై అధికారిక ప్రకటన


Also read: JNTU exams 2021: ఇంజనీరింగ్, ఫార్మసీ ఎగ్జామ్స్ వాయిదా వేసిన JNTU


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook