Gangula Kamalakar Tested Positive: కరోనా బారినపడ్డ మరో తెలంగాణ మంత్రి
తెలంగాణలో మరో మంత్రి గంగుల కమలాకర్ కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. హోమ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిన ఆయన.. తనను కలిసిన వారందరిని టెస్ట్ లు చేయించుకోమని సూచించారు.
Gangula Kamalakar Tested Positive: కరోనా మహమ్మారి (Corona Crisis).. ప్రపంచ దేశాలకు ఆర్థికంగా మరియు ప్రాణ నష్టం కలిగించింది. ఇప్పటికీ కొన్ని దేశాలు కరోనా (Corona) కోరల్లో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నాయి. మన దేశంలో గత కొంత కాలంగా కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుంది. కానీ కొంత మంది ప్రముఖులు కూడా కరోనా భారినపడుతున్నారు.
ఇక తెలంగాణ రాష్ట్రం (Telangana State) విషయానికి వస్తే, చాలా మంది అధికారులు, ప్రజాప్రతినిధులు కరోనా భారిన పడగా... కొంత కోలుకుంటే మరి కొందరు ప్రాణాలను కోల్పోయారు. ఇదిలా ఉండగా కొత్తగా తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ (Telangana MP Gangula Kamalakar) కరోనా భారినపడ్డారు. గత కొన్ని రోజులు జలుబు, జ్వరంతో బాధపడుతున్న కమలాకర్ (Kamalakar)... టెస్ట్ చేయించుకోగా.. పాజిటివి నిర్దారణ అయింది.
Also Read: Virat Kohli Crying Video:ఏడ్చేసిన కోహ్లీ & డివిలియర్స్..ఇంటర్నెట్ లో వైరలైన వీడియో
పాజిటివ్ నిర్దారణ అవ్వగానే... మంత్రి గంగుల కమలాకర్ హోమ్ ఐసోలేషన్‌లోకి (Home Isolation) వెళ్లారు మరియు ఈ మధ్య తనతో కలిసినవారు, బంధువులు మరియు సన్నిహితులు టెస్ట్ చేయించుకోవాలని ఆయన సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి