Ktr defamation : టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ కొనసాగుతోంది. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్‌పై పరువు నష్టం దావా వేశారు టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఈమేరకు న్యాయవాది ద్వారా నోటీసులు జారీ చేశారు. ఈనెల 11న ట్విట్టర్‌ వేదికగా తనపై బండి సంజయ్ నిరాధారమైన ఆరోపణలు చేశారని నోటీసులులో పేర్కొన్నారు. ఆ ఆరోపణల్లో ఆధారాలు ఉంటే బయట పెట్టాలని..లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఇదివరకే తెలిపారు. ఈమేరకు ఇవాళ నోటీసులు జారీ చేశారు. మంత్రి కేటీఆర్‌పై కావాలనే తప్పుడు ప్రచారం చేశారని నోటీసులో న్యాయవాది వివరించారు. జాతీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ కనీస విలువలు పాటించకుండా..విద్యార్థుల ఆత్మహత్యలను తన క్లైంట్‌కు ఆపాదించే ప్రయత్నం చేశారని తెలిపారు. మంత్రి కేటీఆర్ పరువుకు భంగం కలిగించేలా..అసత్య ప్రచారం చేసిన బండి సంజయ్‌ చట్టరిత్యా చర్యలకు అర్హులవుతున్నారని నోటీసులో పేర్కొన్నారు. 48 గంటల్లో తన క్లైంట్, మంత్రి కేటీఆర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని న్యాయవాది నోటీసులులో స్పష్టం చేశారు.


బండి సంజయ్‌(BANDI SANJAY)పై పరువు నష్టం దావా వేయడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఉన్న విషయాలనే ఆయన ప్రజల దృష్టికి తీసుకొచ్చారని చెబుతున్నారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలను ప్రజలకు వివరిస్తామంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో మంత్రి కేటీఆర్  పరువు నష్టం దావా అంశం హాట్ టాపిక్‌గా మారింది.


Also read:Telangana BJP: తెలంగాణలో కమలనాథుల దశ తిరిగేనా..?


Also read:Weight loss Tips: ఇంటిలో లభించే వాటిలో బరువును తగ్గించుకోండి..అది ఎలానో తెలుసుకోండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.