హైదరాబాద్: 2019 ఎన్నికల్లో బీజేపీతో తమ పార్టీ పొత్తు పెట్టుబోదని కేసీఆర్ తనయుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ట్విట్టర్ సెషన్ లో ఆయన మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీకి తమ పార్టీకి చాలా విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని.. పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు కలిసిగిన పార్టీలు కలుస్తాయనుకోడవం అర్థరహితమని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వంలో భాగస్వాములయ్యే ప్రసక్తేలేదని ఈ సందర్భంగా కేటీఆర్ తేల్చి చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీఆర్ఎస్ ఫ్యూర్ సెక్యులర్ పార్టీ..
సెక్యులర్ విధానంలో తాము నిరూపించుకోవాల్సిన పనిలేదని..తమది ప్యూర్ సెక్యులర్ పార్టీ అనడానికి ఎలాంటి సందేహం మంత్రి కేటీఆర్ మరోమారు స్పష్టం చేశారు . అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోవడమే తమ విధానమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ తాము సెక్యులర్ భావాజాలం ఉన్న పార్టీలతో మాత్రమే కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.


టీఆర్ఎస్-బీజేపీ లు రహస్య ఒప్పందం చేసుకున్నాయాని గత కొన్ని రోజుల వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు ప్రజాక్షేత్రంలో ప్రచారం చేసుకుంటున్నాయి. ఇది చాలదన్నట్లు పక్క రాష్ట్రానికి చెందిన సీఎం చంద్రబాబు సైతం స్పందించి బీజేపీతో తెరచాటున టీఆర్ఎస్ దోస్తీ చేస్తోందని ఆరోపించారు. ఈ విమర్శలపై మంత్రి కేటీఆర్ ఈ మేరకు స్పందించారు.