హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఎన్నికల పండగకు రంగం సిద్ధమైంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు ఇటీవల హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో న్యాయపరమైన చిక్కులు తొలగిపోయిన సంగతి తెలిసిందే. దీంతా తాజాగా రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల పోలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇలా ఉన్నాయి.


ముఖ్యమైన తేదీలు:
డిసెంబర్ 30న ఎలక్ట్రోరల్, డ్రాఫ్ట్
డిసెంబర్ 31 నుంచి జనవరి 2వ తేదీ అభ్యంతరాల స్వీకరణ
డిసెంబర్ 31న అఖిలపక్షంతో ఈసీ సమావేశం
జనవరి 1న మున్సిపల్ కమిషనర్లతో ఈసీ భేటీ
జనవరి 3న అభ్యంతరాలకు పరిష్కారం
జనవరి 4న ఓటర్ల తుదిజాబితా విడుదల
జనవరి 7న ఎన్నికల నోటిఫికేషన్
జనవరి 8 నుంచి నామినేషన్ల స్వీకరణ
జనవరి 10వ తేదీన నామినేషన్ల స్వీకరణకు చివరి గడువు
జనవరి 11న నామినేషన్ల పరిశీలన
జనవరి14న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
జనవరి 22న  పోలింగ్
జనవరి 25న మున్సిపల్ ఎన్నికల ఫలితాల వెల్లడి