Telangana new Cheif secretary : తెలంగాణ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేష్ కుమార్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శైలేంద్ర కుమార్ జోషి.. ఈ రోజు ( మంగళవారం) పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త సీఎస్ ను నియమించింది. తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేష్ కుమార్ ను నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శైలేంద్ర కుమార్ జోషి.. ఈ రోజు (మంగళవారం) పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త సీఎస్ ను నియమించింది. తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేష్ కుమార్ ను నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వు పత్రాలపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. 2020 జనవరి 1న అంటే రేపు ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఆయన ఈ పదవిలో 2023 డిసెంబర్ 31వరకు కొనసాగుతారు. సోమేష్ కుమార్ ఎక్కువ సమయం ఈ బాధ్యతలు నిర్వహించడం వల్ల స్థిరత్వం ఉంటుందని సీఎం కేసీఆర్ భావించినట్లుగా తెలుస్తోంది. అందుకే సోమేష్ కుమార్ వైపే ఆయన మొగ్గు చూపినట్లుగా సమాచారం .
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఎస్.కే. జోషి
మరోవైపు ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి పదవీ విరమణ పొందిన శైలేంద్ర కుమార్ జోషిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నీటిపారుదల శాఖ వ్యవహారాల సలహాదారుగా ఆయన వ్యవహరించే అవకాశం ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..