CLP Meet: తెలంగాణలో పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించారు. తొలిసారిగా కాంగ్రెస్ పార్టీకు పట్టం కట్టారు. ముఖ్యమంత్రి ఎవరనేది మరి కాస్సేపట్లో స్పష్టత రావచ్చు. అంతకంటే ముందు కీలకమైన కాంగ్రెస్ లెజిస్టేచరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమంలోనే సీఎల్పీ నేతను ఎన్నుకుంటారా లేదా ఎంపిక నిర్ణయాన్ని అధిష్టానానికి వదిలేస్తారా అనేది తేలాల్సి ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలతో స్పష్టమైన మెజార్టీ సాధించి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. రెండుసార్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ కేవలం 39 స్థానాలకు పరిమితమైంది. ముఖ్యమంత్రి రేసులో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పేర్లు ప్రధానంగా విన్పిస్తున్నాయి. రేవంత్ రెడ్డికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వాదన విన్పిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు కంటే ముందు కీలకమైన సీఎల్పీ సమావేశం మరి కాస్సేపట్లో జరగనుంది. ఇందులో సీఎల్పీ నేతను ఎన్నుకునే అవకాశాలున్నాయి. లేదా అధిష్టానం నిర్ణయించే వ్యక్తిని అంగకీరిస్తామంటూ సీఎల్పీ సమావేశం ఏకవాక్య తీర్మానంలో తీర్మానించవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సీఎల్పీ నేత ఎంపిక అధికారాన్ని ఏకవాక్య తీర్మానంతో అధిష్టానానికి అప్పగించే సాంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది. 


ఈసారి కూడా అదే సాంప్రదాయం కొనసాగవచ్చు. సీఎల్పీ సమావేశంలో అందరూ కలిసి ఏకవాక్య తీర్మానంతో సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగించనున్నారని సమాచారం. సీఎల్పీ సమావేశం కూడా ఏఐసీసీ నుంచి ఇప్పటికే చేరుకున్న పరిశీలకుల సమక్షంలో జరగనుంది. పరిశీలకులు ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్నందున అధిష్టానం సీల్డ్ కవర్ ద్వారా సీఎల్పీ నేత పేరు ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదు. 


Also read: Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో కీలక పరిణామాలు, భారీ విజయాలు, ఊహించని ఓటములు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook