Telangana Governor: ప్రస్తుతం తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలకు వేరే రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఇంచార్జ్ గవర్నర్ లుగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా కేంద్రం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లను నియమించింది. కొంత మందికి ఉద్వాసన పలికింది.  ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 10 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లను నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. నిన్నటి వరకు తెలంగాణకు ఇంఛార్జ్ గవర్నర్ గా ఉన్న జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న సిపీ రాధాకృష్ణన్ ను మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. అక్కడ గవర్నర్ గా ఉన్న మహేష్ బైస్ ను ఆ పదవి నుంచి తప్పించారు.  ఇక త్రిపురకు చెందిన బీజేపీ నేత మాజీ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన జిష్ణు దేవ్ వర్మను తెలంగాణ గవర్నర్ గా నియమించారు. త్వరలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి..తెలంగాణ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈయన 1957 ఆగష్టు 15న జన్మించారు. అంతేకాదు త్రిపుర రాష్ట్రానికి రెండో ఉప ముఖ్యమంత్రిగా  2018- 2023 వరకు బాధ్యతలు నిర్వహించారు. అంతేకాదు గతంలో బాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా పనిచేసారు. ఈయన త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పార్టీలో 1990లో చేరారు. ఈయనకు బీజేపీ అధిష్టానం తగిన సమయంలో తగిన పదవిని ఇచ్చి గౌరవించిందని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. అటు త్రిపుర గవర్నర్ గా ఉన్న ఇంద్ర సేనా రెడ్డి .. తెలంగాణకు చెందిన నేత. ఈయన ఆ రాష్ట్రానికి గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తుంటే.. తాజాగా త్రిపురకు చెందిన జిష్ణు దేవ్ వర్మను తెలంగాణ గవర్నర్ గా నియమించడం విశేషం.


రాజస్థాన్ గవర్నర్ గా మహారాష్ట్ర మాజీ స్పీకర్ హరిభావ్ కిషన్ రావు బాగ్డేను నియమించారు. ఇక రాజస్థాన్ గవర్నర్ గా ఉన్న కల్ రాజ్ మిశ్రాను ఆ స్థానం నుంచి తప్పించారు. అటు రాజస్థాన్ కు చెందిన బీజేపీ నాయకులు ఓం ప్రకాష్ మాథుర్ ను సిక్కిం గవర్నర్ గా నియమించారు. అక్కడ గవర్నర్ గా ఉన్న లక్ష్మణ ప్రసాద్ ఆచార్యను అస్సామ్ గవర్నర్ గా ట్రాన్స్ ఫర్ చేసారు. ఇక మణిపూర్ గవర్నర్ గా ఉన్న అనసూయ ఊకేను గవర్నర్ పదవిని నుంచి తప్పించారు.


అటు యూపీకి చెందిన సీనియర్ బీజేపీ నేత సంతోష్ గాంగ్వర్ ను ఝార్ఖండ్ గవర్నర్ గా నియమించారు. అటు అస్సామ్ కు చెందిన ఎంపీ రమెన్ డేకాను ఛత్తీస్ గడ్ రాష్ట్రానికి గవర్నర్ నియమితులయ్యారు. ఆ రాష్ట్రానికి చెందిన బిశ్వభూషణ్ హరిచందన్ ను పదవి పూర్తి కావడంతో ఆయన్ని  తప్పించారు.
 
అటు కర్ణాటకకు చెందిన సీనియర్ మాజీ మినిష్టర్ విజయ్ శంకర్ ను మేఘాలయా గవర్నర్ గా నియమితులయ్యారు. ఆ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్న ఫగు చౌహాన్ ను గవర్నర్ గిరి నుంచి పక్కకు తప్పించారు. అటు అస్సామ్ గవర్నర్ గా ఉన్న గులాబ్ చంద్ కటారియాను పంజాబ్ గవర్నర్ గా నియమించింది. అటు కేంద్ర పాలిత ప్రాంతం ఛండీగఢ్ కు అడ్మినిస్ట్రేటర్ గా నియమించింది. అటు పంజాబ్ గవర్నర్ గా ఉన్న బన్వారీ లాల్ పదవి నుంచి తప్పించారు. 1979 ఐఏఎస్ బ్యాచ్ చెందిన అధికారి కైలాస నాథన్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించడం విశేషం.


ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..


ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter