తెలంగాణ గ్రామపంచాయితీ ఎన్నికలకు నగారా మ్రోగింది. ఈ మేరకు ఎన్నికల అధికారి నాగిరెడ్డి షెడ్యూల్ ను విడుదల చేశారు. మొత్తం మూడు దశలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించనున్నారు. జనవరి 21న తొలి విడత, 25న రెండో విడత, జనవరి 30న మూడో విడత పోలింగ్‌ జరగనుంది. తొలి విడత ఎన్నికల ప్రక్రియ జనవరి 7న ప్రారంభమై 21తో ముగుస్తుంది. అలాగే 11న మొదలయ్యే రెండో దశ ఎన్నికలు ఈ నెల 25తో ముగుస్తాయి. 16న మొదలయ్యే మూడో విడత ఈ నెల 30న ముగుస్తుంది. పోలింగ్ సమయం విషయానికి వస్తే ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమై.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ముగుస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం కోటి 49 లక్షల 52 వేల 58 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో మొత్తం 12,732 గ్రామ పంచాయతీలు.. 1,13,170 వార్డుల్లో ఓటర్లు తమ ఓటహక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కోసం లక్ష 13 వేల 190 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పేపర్ ద్వారనే పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నవంబర్ 19వ నమోదైన వారికి ఓటు హక్కు
ఈ సందర్భంగా ఎన్నికల అధికారి నాగిరెడ్డి ఎన్నికల సంబంధించి వివరాలు మీడియాకు తెలిపారు. నవంబర్ 19 వరకు ఓటు హక్కు నమోదైన వారికే పంచాయితీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశముందని పేర్కొన్నారు. ఓ తర్వాత ఓటర్లగా నమోదైతే ప్రత్యేక లిస్ట్ గా గుర్తించి ఓటు హక్కు కల్పిస్తామన్నారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పోలింగ్ ముగిసిన రోజే  మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు


తక్షణమే ఎలక్షన్ కోడ్ అమలు
ఈ సందర్భంగా ఎన్నికల అధికారి నాగిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటి నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. ఎన్నికలు ముగిసే వరకు కొత్త ప్రాజెక్టులు కానీ..ఇతర పథకాలు కానీ ప్రకటించడానికి వీలులేదని తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వల్ల 19 పంచాయితీల్లో ఎన్నికలు నిర్వహిండం లేదని వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు ఎన్నికల కమిషన్ వెబ్ సైట్  పొందుపరిచినట్ల ఈ సంద్భంగా నాగిరెడ్డి పేర్కొన్నారు


ఖర్చుపరిమితే దాటితే ఖబర్దార్..
ఈ సందర్భంగా ఎన్నికల అధికారి నాగిరెడ్డి  ఎన్నికల ఖర్చు పరిమితి వివరాలను తెలిపారు 5 వేలకు మించి జనాభా ఉన్న గ్రామంలో సర్పంచ్ అభ్యర్ధి 2 లక్షల 50 కంటే ఎక్కువ ఖర్చు పెట్టరాదు..అలాగే 5 వేల జనాభాకంటే తక్కువగా ఉన్న గ్రామంలో ఎన్నికల ఖర్చు రూ.లక్షా 50 వేల కంటే ఎక్కువ ఖర్చు పెట్టరాదని వెల్లడించారు.. ఒక వేళ ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెడితే అవినీతికి పాల్పడినట్లుగా గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. ఒక వేళ గెలిచినా కూడా పదవి కోల్పోయే అవకాశముందని హెచ్చరించారు.