Revanth Reddy Arrest : రాకేష్ ను చంపింది టిఆర్ఎస్.. చంపించింది బీజేపీ! రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్
Revanth Reddy Arrest : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంస కాండపై రాజకీయ రచ్చ ముదురుతోంది. రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో రాకేష్ అనే యువకుడు చనిపోగా.. ఇప్పుడు అతని చుట్టే రాజకీయాలు సాగుతున్నాయి. రాకేష్ మృతదేహానికి నివాళి అర్పించేందుకు నర్సంపేట వెళుతున్న తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.
Revanth Reddy Arrest : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంస కాండపై రాజకీయ రచ్చ ముదురుతోంది. రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో రాకేష్ అనే యువకుడు చనిపోగా.. ఇప్పుడు అతని చుట్టే రాజకీయాలు సాగుతున్నాయి. రాకేష్ మృతదేహానికి నివాళి అర్పించేందుకు నర్సంపేట వెళుతున్న తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఘట్కేసర్ టోల్ ప్లాజా దగ్గర రేవంత్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు రాచకొండ పోలీసులు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు రేవంత్ రెడ్డి. ఏసీపీ శ్యామ్ సుందర్ ను నిలదీశారు. టీఆర్ఎస్ నేతలకు లేని ఆంక్షలు తనకెందుకని ప్రశ్నించారు. మల్కాజ్ గిరి ఎంపీ అయిన తనకు నియోజకవర్గంలో ఎక్కడైనా తిరిగే అవకాశం ఉందని.. తన లోక్ సభ పరిధిలో ఉన్న ఘట్కేసర్ లో ఎలా అడ్డుకుంటారని రేవంత్ రెడ్డి నిలదీశారు. రేవంత్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా రావడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.
పోలీసులు తనను అరెస్ట్ చేయడంపై తీవ్రంగా స్పందించారు రేవంత్ రెడ్డి.రైల్వే పోలీసుల కాల్పుల్లో చనిపోయిన రాకేష్ కుటుంబాన్ని తాను పరామర్శిస్తే పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. రాకేష్ భౌతిక కాయానికి నివాళులు అరిస్తే వరంగల్ వెళ్తే టీఆర్ఎస్ కు నష్టమేంటని నిలదీశారు. టిఆర్ఎస్ మంత్రులు రాకేష్ శవయాత్ర చేయొచ్చు .. గులాబీ జెండాలు కట్టుకొని యాత్రలో పాల్గొనవచ్చు.. తాము వెళ్ళడానికి ఇన్ని అడ్డంకులా అని రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. రాకేష్ ను చంపింది టీఆర్ఎస్ అయితే.. చంపించింది బీజేపీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. చావులను కూడా టిఆర్ఎస్ రాజకీయంగా వాడుకోవాలని చూస్తుందని ఆరోపించారు. ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరన్న పీసీసీ చీఫ్.. త్వరలోనే సిరిసిల్లలో నిరుద్యోగ డిక్లేరేషన్ ప్రకటిస్తామని చెప్పారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తాను వరంగల్ వెళుతున్నది రాజకీయాల కోసం కాదన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని పోలీసులను నిలదీశారు.
అంతకుముందు హైదరాబాద్ లోని తన నివాసంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కేంద్ర సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. మోడీ సర్కార్ అనాలోచిత నిర్ణయం వల్లే యువకులు చనిపోతున్నారని ఆరోపించారు. ఆర్మీకి సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయాన్ని కేంద్రం హడావుడిగా తీసుకొచ్చిందన్నారు. సైనికులను నాలుగేళ్ల ప్రాతిపదికన నియమించడం దారుణమన్న రేవంత్‌రెడ్డి.. ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్మీలో ఔట్ సోర్సింగ్ నియామకాలు చేపట్టడం దారుణమన్నారు. మెడికల్, ఫిజిలక్ టెస్టులు పూర్తి చేసుకుని పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులను కేంద్రం రోడ్డున పడేసిందని అన్నారు. పోలీసుల కాల్పుల్లో ఒక వ్యక్తి చనిపోతే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించకుండా.. అమిత్ షా దగ్గరకు వెళ్లారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీనే అల్లర్లు చేయించిందని కొందరు బీజేపీ నేతలు చిల్లరగా వాగారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారణాసిలో జరిగిన అల్లర్లు కూడా తెలంగాణ కాంగ్రెస్ చేయించిందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Read also: Rajnath Singh Review on Agnipath: దేశంలో చల్లారని అగ్నిపథ్ మంటలు..రాజ్‌నాథ్‌సింగ్ కీలక రివ్యూ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook