Revanth Reddy Challenges KCR: శాసనసభలో శ్రీధర్ బాబు ప్రశ్నిస్తుంటే మంత్రులు అడ్డుకుంటున్నారని మండిపడిన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ సమావేశాల్లో ఇదేం సంస్కృతి అని ప్రభుత్వాన్ని నిలదీశారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుని ఉంటే ములుగు ఎమ్మెల్యే సీతక్కలాంటి వారు కన్నీరు పెట్టాల్సిన అవసరం రాదు కాదు అని అసహనం వ్యక్తంచేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులకు అండగా నిలవాల్సిన బీఆరెస్ ఎమ్మెల్యేలు వీధుల్లో తిరుగుతూ రౌడీయిజం చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. వరద బాధితులకు నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ఎవరైనా అడ్డుకున్నారా ? అని నిలదీశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసిన రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయిందా ? లేక మున్సిపల్ శాఖ మంత్రి వరదల్లో కొట్టుకుపోయారా ? రాష్ట్రంలో మంత్రులు లేరా ? అని ప్రశ్నించారు. పెద్దపల్లిలో దాసరి మనోహర్ రెడ్డి దేవుడి మాన్యాలను కూడా వదలడం లేదు. ఈసారి మనోహర్ రెడ్డిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ప్రజల్లో ఉండి ప్రజల కోసం మేం కొట్లాడుతున్నాం. మీ కోసం మేముంటాం.. మా కోసం మీరు ఉండండి అని ప్రజలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పార్టీ జెండా మోసిన వారిని కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందన్నారు.


హైదరాబాద్ చుట్టుపక్కల కేసీఆర్ కుటుంబం బినామి పేర్లతో 10 వేల ఎకరాలు కబ్జా చేశారు. లక్ష కోట్లు వెనకేసుకున్నారు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంది. కేసీఆర్‌కు ఇక తెలంగాణతో రుణం తీరిపోయింది.. ఆయనకు తెలంగాణపై మోజు తీరింది. అందుకే ఒకవైపు తెలంగాణలో వరదలు వచ్చి జనం అల్లాడుతుంటే.. కేసీఆర్ వరద ప్రాంతాల్లో పర్యటించకుండా.... మహారాష్ట్రకు వెళ్ళాడు. మహారాష్ట్రలో పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ తెలంగాణలో రైతులపై లేదు. మన క్షేమం పట్టని కేసీఆర్ మనకు ఇంకా అవసరమా చెప్పండి అంటూ ప్రజలను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. రాక్షసులందరినీ పుట్టించిన బ్రహ్మరాక్షసుడు కేసీఆర్. బ్రహ్మరాక్షసుడికి మందు పెట్టి బొంద పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది... ధర్మయుద్ధం చేయాల్సిన సమయం వచ్చేసింది. ఈ యుద్ధంలో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అని ధీమా వ్యక్తంచేయాల్సిన రేవంత్ రెడ్డి.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్త తీసుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.


ఇది కూడా చదవండి : Farmers Crop Loans Waiver: రైతుల రుణమాఫీ ఆలస్యానికి అదే అసలు కారణం.. కేసీఆర్ కాదు..


కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సూటిగా సవాల్ విసురుతున్నా. " తెలంగాణను నిజంగానే మీ ప్రభుత్వం, మీ పార్టీ బంగారు తెలంగాణ చేసుంటే... మీ పార్టీలో సిట్టింగులు అందరికీ సీట్లు ఇవ్వు... నువ్ గజ్వేల్ నుంచి పోటీ చెయ్ " అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పని తీరుపై సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నారని.. ఈసారి ఎన్నికల్లో వారికి కాకుండా వేరే వారికి టికెట్ ఇవ్వనున్నారనే వార్తల నేపథ్యంలో కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి ఈ సవాల్ విసిరారు. కేసీఆర్ స్వయంగా అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు టికెట్లు రావని.. ఒకవేళ కేసీఆర్ తన సవాలుని స్వీకరించి వారికి టికెట్ ఇచ్చినా.. ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో జనం ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తి, ఆగ్రహంతో వారే ఆ ఎమ్మెల్యేలను ఓడిస్తారనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్టు అర్తం చేసుకోవచ్చు.


ఇది కూడా చదవండి : CM KCR Decision on Rythu Runa Mafi 2023: రైతు రుణ మాఫీపై కేసీఆర్ కీలక నిర్ణయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి