Telangana police tops in recovering 30,000 missing mobiles: సాధారణంగా రద్దీ ప్రదేశాలలో ఫోన్ ల ఎక్కువగా మిస్ అవుతుంటాయి. ముఖ్యంగా బస్సులు, మెట్రోలు, ట్రైన్లలో ఫోన్ లను ఎక్కువగా చోరీలు చేస్తుంటారు. మన వెనుకాలే ఉండి, మెల్లగా జేబులు చేయిపెట్టీ చోరీలకు పాల్పడుతుంటారు. ప్రతిరోజు ఫోన్ ల చోరీలకు చెందిన కేసులు నమోదువుతునే ఉంటాయి. చోరీ చేసిన ఫోన్ లను డిసెబుల్ చేసి ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి అక్కడి అమ్ముతుంటారు. తరచుగా ఫోన్ లను కొందరు మారుస్తుంటారు.. నేటి యువత ఎక్కువగా ఫోన్లను కొంటుంటారు. మార్కెట్ లో ఏ ఫోన్ వచ్చిన కూడా వెంటనే కొనేస్తుంటారు. అది ఎంత కాస్లీగా ఉన్న కూడా అస్సలు పట్టించుకోరు. ఎంతడబ్బుడైన పోసి, ఫోన్ లను కొంటుంటారు. ఇక కొందరు కేటుగాళ్లు ఫోన్లను చోరీ చేస్తుంటారు. కాస్తంతా నెగ్జీజెన్సీగా ఉన్న కూడా సెకన్లలో ఫోన్ లు  చోరీలు చేస్తుంటారు. ఇదిలా ఉండగా ఫోన్ కొనగానే దాని ఐఎంఈఐ నంబర్ ను సేవ్ చేసుకొవాలని పోలీసులు సూచిస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Hyderabad: కంటోన్మెంట్ ఆస్ప‌త్రి వద్ద ఘోరం..  చెట్టు మీద పడటంతో వ్యక్తి మృతి, భార్య సీరియస్.. వైరల్ గా మారిన వీడియో..


ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అప్ డేట్ అయ్యింది. ఒకప్పటి లాగా ఫోన్ లు చోరీ చేయగానే.. అమ్మేస్తామంటే అయిపోదు. దాని లోకేషన్ ద్వారా కూడా ట్రెస్ చేస్తుంటారు. కొన్ని మొబైల్ ఫోన్ ల పాస్ వర్డ్ లు అస్సలు ఓపెన్ కావు. ఫోన్ ఒక వేళ కన్పించకుండా పోతే.. ఎవరైన చోరీ చేస్తే వెంటనే దగ్గరలోని పీఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. పోలీసులు టెక్నాలజీని ఉపయోగించుకుని మిస్ అయిన ఫోన్ లను రికవరీ చేస్తున్నారు . దీనిలో హైదరాబాద్ పోలీసులు Ceir పోర్టల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీని వల్ల ఏడాది కాలంలో 30 వేల ఫోన్ లు రికవరీ చేసినట్లు తెలుస్తోంది. 


పూర్తి వివరాలు..


తెలంగాణ పోలీసులు సైబర్ సెక్యురిటీలో అరుదైన రికార్డు సాధించారు. గతంలో కంటే ఎక్కడ కూడా శాంతి భద్రతల సమస్యల తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు . నగరంలో ప్రతి చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రతినిముషం కూడా డేగ కళ్లతో బందో బస్తు ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల హైదరాబాద్ పోలీసులు అరుదైన రికార్డు నెలకొల్పారు.  సంవత్సర కాలంలో 30 వేల ఫోన్లను రికవరీ చేసిన సరికొత్త రికార్డును తమ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా...చోరీకి గురైన, మిస్ అయిన సెల్ఫోన్లో రికవరీ లో రికార్డులో రికార్డు సాధించినట్లు తెలుస్తోంది. తెలంగాణ పోలీస్ లు ..Ceir పోర్టల్ తొ పాటు లోకల్ ట్రాకింగ్ ను ఉపయోగించుకును ఈ ఘనతను సాధించారు. దీనిపై ఐపీఎస్ మహేష్ భగవత్ పలు కీలక విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం... సెల్ఫోన్ల  రికవరీలో .. దేశంలో రెండో స్థానాన్ని ఆక్రమించుకున్నామని అన్నారు. ఫోన్ దొంగతనం లేదా మీ మొబైల్ కనిపించకుండా పోయిన వెంటనే సి ఈ ఐ ఆర్ పోర్టల్ లో  నమోదు చేసుకోవాలని సూచించారు. 


Read more: Yadadri Temple: నరసింహా జయంతి వేళ యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్.. వారికి నేరుగా ఉచిత దర్శనం.. టైమింగ్స్ ఇవే..


సి ఈ ఐ ఆర్ పోర్టల్ లో  ఒకసారి నమోదు చేసుకుంటే ఫోన్లో ట్రాకింగ్ ఈజీ అవుతుందని మహేష్ భగవత్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. హైదరబాద్ నగరం ప్రతిరోజు విస్తరిస్తుంది. ఇక్కడ ఎంతో మంది ఉపాధిని, ఉద్యోగం కోసం వస్తున్నారు. ఇక పర్యాటక ప్రదేశాలు కూడా ఉండటతో పర్యాటకులు కూడా వస్తుంటారు. ఇదే అదునుగా భావించి కొందరు కేటుగాళ్లు కాస్లీ ఫోన్ లు టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter