Prof Kodandaram: తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో సమానంగా వినపడిన  పేరు.  ఉద్యమ సమయంలో ఆయన ఏ పిలుపు నిచ్చినా తెలంగాణ వాదులు ఆందోళనలో పాల్గొన్నారు. ప్రొఫెసర్ గా ఆయన ఎంతో మంది విద్యార్థులకు, నిరుద్యోగులకు ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా తన ఉద్యమ పంథా వీడలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తన పోరాటాన్ని ఆపలేదు. నిరుద్యోగ అంశం, ఇతర అంశాలు ఏదైనా ప్రభుత్వంపై తన నిరసన గళం విప్పారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రొఫెసర్ గారి తీరే మారిందట. ప్రజా ఉద్యమాల్లో ఎప్పుడూ తన గళం వినిపించే ప్రొఫెసర్ సైలెంట్ కావడంపై రక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఫ్రొపెసర్ గారి మౌనం వెనుక ఉన్న కారణం ఏంటి..?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ పేరు చెబితే చాలు అనే సమైక్యాంధ్రులు గడగడలాడిపోయే వారు.ఆయన ఎప్పుడు ఏ పిలుపునిస్తారో అని నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు కూడా భయపడేవారు. అప్పుడు పరిస్థితులు అలా ఉండేవి. తెలంగాణ ఉద్యమ కాంక్షను బలంగా వినిపించేందుకు ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు జరిగాయి. కోదండరాం పిలుపునిచ్చిన ప్రతి ఆందోళనలో వేల సంఖ్యలో తెలంగాణ వాదులు పాల్గొని తమ ఆకాంక్షను పాలకులకు తెలిపారు. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగర హారం ఇలా ఆయన ఇచ్చిన పిలుపులు విజయవంతం అయ్యాయి. తెలంగాణ ఉద్యమ జేఏసీ ఛైర్మన్ గా ఆయన పిలుపుకు తెలంగాణ వాదులు కదిలేవారు. 


తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ ఏర్పడే సమయం వరకు కోదండరాం కు , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సన్నిహిత సంబంధాలు ఉండేవి. కానీ ఉద్యమ సమయంలో కొన్ని ఆందోళనలో విషయంలో ఇరువురికి కొంత గ్యాప్ వచ్చిందని జేఏసీలోని సభ్యులు అంటుంటారు. కోదండరాం  ప్రజా ఉద్యమంతో ఆందోళనలను తీవ్రతరం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుందని కోదండరాం అభిప్రాయం అదే సమయంలో కేసీఆర్ ఆలోచన మాత్రం దీనికి విరుద్ధంగా ఉండేదట. రాజకీయ ఏకీకరణతోనే తెలంగాణ సాధ్యం అవుతుందని కేసీఆర్ అభిమతంగా ఉండేదట.ఇలా ఇద్దరి మధ్య చిన్న చిన్న భేధాభిప్రాయాలు ఉండేవట.ఇది తెలంగాణ వచ్చేంత వరకు అలా ఉండిపోయాయట.


తెలంగాణ ఏర్పాటు అయ్యాక కొంత మంది జేఏసీ నాయకులను కలుపుకొని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీనీ కోదండ రామ్ కలిసారు.ఇది కేసీఆర్, కోదండరాం మధ్యకు తీవ్ర ఆగాధాన్ని ఏర్పర్చింది. ఇదే సమయంలో తెలంగాణలో ఎన్నికలు కూడా వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. కేసీఆర్ రాష్ట్రా అధినేతగా ఉన్న తొలి నాళ్లలో కోదండ రాం కొంత సైలెంట్ గా ఉన్న రోజులు గడిచిన కొద్దీ బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలపై కోదండరాం గళమెత్తడం షురు చేశారు.  ముఖ్యంగా నిరుద్యోగ అంశం, రైతుల అంశాలపై పోరటాలకు పిలుపు నిచ్చారు. ఆ తర్వాత తానే స్వయంగా కేసీఆర్ పై పోరాటం కోసం ప్రత్యేకంగా తెలంగాణ జన సమితి అనే రాజకీయ పార్టీనీ కూడా స్థాపించారు. పార్టీ పెద్దగా జనాల్లోకి వెళ్లలేదు. నామా మాత్రంగానే పార్టీ కొనసాగింది. జనసమితి తరుపున ఎన్నికల్లో పోటీ చేసిన ఘోర పరాభవాన్ని చూసింది. స్వయంగా కోదండరాం కూడా ఎన్నికల్లో ఓటమి చెందడం ఆప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.


కేసీఆర్ వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో వచ్చినా కోదండరాం మాత్రం తన ఉద్యమ పంథాను వీడలేదు. సందర్భం దొరికినప్పుడల్లా కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడేవారు. అదే సమయంలో కేసీఆర్ సర్కార్ కూడా కోదండరాంను తీవ్ర నిర్బంధాలకు గురి చేసింది. కోదండరాం ను బయటకు వెళ్లకుండా తీవ్రంగానే కట్టడి చేసింది. కోదండరామ్ పై అనుక్షణం నిఘా కూడా ఉంచింది. కొన్ని సందర్భాల్లో కోదండరామ్ ను హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా ఇంటి లోపల ఉన్న కోదండరామ్ ఇంటి తలుపులు బద్దలు కొట్టీ మరీ అరెస్ట్ చేసిన నేపథ్యం ఉంది. ఐనా కోదండరాం మాత్రం తన పోరాటాన్ని మాత్రం ఆపలేదు. ఇలా కేసీఆర్,కోదండరామ్ మధ్య రాజకీయంగా ,వ్యక్తిగతంగా పూడ్చలేని అగాధం ఏర్పర్చింది. ఇలా ఇద్దరి మధ్య వ్యవహారం ఉప్పు- నిప్పులా ఉండేది. 


అయితే కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడున్న కోదండరాం , కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. తొలి నుంచి కాంగ్రెస్ కు కొంత అనుకూలంగా కోదండరాం వైఖరి ఉండేది. కోదండరామ్ ఇచ్చిన పిలుపుకు కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రజా సంఘాలు కూడా పాల్గొనేవి అదే సమయంలో కాంగ్రెస్ పిలుపుకు కూడా కోదండ రామ్ మద్దతు తెలిపేవారు.ఇలా ఇద్దరి మధ్య మంచి అవగాహ ఉండేది.మొన్నటి ఎన్నికల్లో కూడా కోదండరామ్ ఆధ్వర్యంలోని జనసమితి కాంగ్రెస్ రెండు కలిసి ఒక అవగాహనతో ఎన్నికల్లో పోటీ చేశాయి.అంతే కాదు ఎన్నికల్లో ఘన విజయం సాధించాయి. కాంగ్రెస్ గెలుపుతో కోదండరామకు మంచి అవకాశం వస్తుందని అందరూ భావించారు. అందరూ అనుకన్నుట్లుగానే కోదండరాం ను గవర్నర్ కోటా రేవంత్ సర్కార్ ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల నెలల కొద్దీ అది సాధ్యపడలేదు. కోదండరాం ఎమ్మెల్సీగా ఈ మధ్యనే ప్రమాణ స్వీకారం చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా అసలు కోదండరాం తీరుపై అనేక గుసగుసలు వినిపిస్తున్నాయి.


 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కోదండరాం తీరే మారిపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉద్యమాలకు మారు పేరుగా నిలిచిన ప్రొఫెసర్ గారు ఎందుకో పూర్తి సైలెంట్ గా అయ్యారని చర్చించుకుంటున్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదే పదే స్పందించిన కోదంరాం ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారనే కోదండరాం సన్నిహితులు కూడా అంటున్నారట. ఇటీవల కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న పలు నిర్ణయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి అలాంటి వాటి పట్ల కూడా కోదండరామ్ కనీసంగా స్పందించ లేదని అంటున్నారు. తెలంగాణ ఉద్యమ మాటున ఎదిగిన కోదండరాం అసలు ఎందుకు ఇలా మారారని తెలంగాణ వాదుల్లో కూడా కొంత చర్చ జరగుతుంది. రేవంత్ సర్కార్ తెలంగాణ చిహ్నలను మార్చాలని నిర్ణయించిన సమయంలో కూడా కోదండరామ్ వైఖరి భిన్నంగా ఉందనే అంటున్నారు. తెలంగాణ అంశాల పట్ల గతంలో స్పందించిన విధంగా ప్రొఫెసర్ గారు స్పందించడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.


ఇదే సమయంలో గ్రూప్స్ , డీఎస్సీ పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి తీరుగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రోజులు పాటు  ఆందోళనను నిరుద్యోగులు కొనసాగించారు. ఇలాంటి సమయంలో కూడా కోదండరాం మౌనంగా ఉండడంపై నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సోషల్ మీడియా వేదికగా కూడా రేవంత్ రెడ్డి వైఖరిని చాలా మంది నిరుద్యోగులు తప్పుబట్టారు.ఐనా కోదండరాం స్పందించ లేదు. ఇక తాజాగా తెలంగాణ సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం బదులు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. దీనిపై కూడా కోదండరామ్ సైలెంట్ ఉంటున్నారు. గత రెండు దశాబ్దాలుగా ప్రతి అంశంపై గళమెత్తిన ప్రొఫెసర్ గారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మాత్రం అన్నింటీకీ మౌనమే సమాధానం చెబతున్నారు. కొందరు మాత్రం కోదండరాం కు కావాల్సిన పదవి వచ్చింది కదా ఇక ఎందుకు మాట్లాడుతారు, ప్రభుత్వాన్ని ఎందకు ప్రశ్నిస్తారు అని విమర్శిస్తున్నారట.


మొత్తానికి ప్రొఫెసర్ కోదండరామ్ తీరుపై పొలిటికల్ సర్కిల్ లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. కోదండరాం మౌనమునిగా ఎందుకు మారిపోయారని . ఆయన సైలెన్స్ ఎందుకు అనేది మాత్రం ఎవ్వరికీ అంతు పట్టడం లేదంట.ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్న కోదండరామ్ భవిష్యత్తులోనైనా కాంగ్రెస్ సర్కార్ చేసే తప్పిదాలపై ప్రశ్నిస్తారా లేదా అనేది చూడాలి.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.