Manakondur MLA Rasamayi Fires On Kadiyam Srihari: కడియం శ్రీహరి మాదిగలకు ద్రోహాం చేశాడని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. తెలంగాణ బీఆర్ఎస్ లో ఉన్న మాల, మాదిగలు వెళ్లేదాక.. పీడించాడని ఎమ్మెల్యే రసమయి మండిపడ్డారు. మాదిగలంటే తొలినాటి నుంచి కడియంకు కళ్లలో మంట అని, అందుకే ఒక్కొక్కరిగా మాదిగల బిడ్డలైన.. తాటికొండ రాజయ్య, అరూరి రమేష్, పసునూరి దయాకర్ లాంటి వాళ్లు పార్టీని విడిచి పోయే దాక వెంటపడ్డాడని అన్నారు. కడియం శ్రీహరి ఒకశిఖండిలా బీఆర్ఎస్ లో వ్యవహరించాడని, ఎప్పుడు చూసిన కేసీఆర్ వెన్నంటే ఉండి, మాదిగ బిడ్డల పట్ల అసత్య ఆరోపణలు చేస్తూ, మాదిగలపై చిన్నచూపు చూసేలా చేశాడన్నారు. వరంగల్ లో ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి బరిలో నిలబడిని కడియం కావ్యకు ప్రజలు బుద్ది చెప్పాలని కూడా ఎమ్మెల్యే రసమయి ప్రజలకు పిలుపునిచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Mamata Banerjee: బీజేపీకి 400 కాదు కదా.. ఆ సీట్లు కూడా రావంటూ ఘాటువ్యాఖ్యలు చేసిన మమతా..


బీఆర్ఎస్ హయాంలో పదేళ్లపాటు హోదాను, గౌరవంను అనుభవించి, ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిన నీచపు చరిత్ర, కడియందని అన్నారు. మాదిగలకు అన్యాయం చేసిన కడియం ఇంటి ముందు చావుదెబ్బకొట్టాలని పిలుపునిచ్చాడు. తెలంగాణేతరుడు ద్రోహాంచేస్తే, తెలంగాణ అవతలి వరకు తరిమికొట్టాలని అన్నారు. అదే విధంగా, తెలంగాణకు చెందిన వ్యక్తి, మోసానికి పాల్పడిన భూమిలో గొయ్యితీసి మరీ పాతేయ్యాలంటూ కూడా ఎమ్మెల్యే రసమయి మండిపడ్డారు. 


అదే విధంగా.. బీఆర్ఎస్ లో గతంలో అధికారం ఎంజాయ్ చేసి, ప్రస్తుతం, కాంగ్రెస్ లో చేరిన, కడియం శ్రీహరి, కావ్య, కేకేశవరావులపై, రసమయి తనదైన స్టైల్ లో మండిపడ్డారు. మిలియన్ మార్చ్ లో కే కేశవరావును  ప్రజలు కోడిగుడ్లతో దాడి చేశారని, రసమయి గుర్తుచేశారు. అసలు కేకే కూతురు  గద్వాల్ విజయలక్ష్మి ఎవరోడా ప్రజలకు తెలియదని, అలాంటి మహిళలను కేసీఆర్ హైదరాబాద్ మేయర్ పదివి మీదకూర్చుండ బెట్టి గౌరవించారని గుర్తు చేశారు.


Read More: Pregnant Colleague: ఇదేం కన్నింగ్ బుద్ధి.. ప్రెగ్నెంట్ లేడీ తాగే నీటిలో విషం కల్పిన సహోద్యోగి.. కారణం తెలిస్తే షాక్..


ఎంత మంది పార్టీ మారిన తాము బీఆర్ఎస్ కేసీఆర్ వెంటనే ఉంటామని రసమయి అన్నారు. కేసీఆర్ ఆదేశిస్తే, వరంగల్ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగుతానని కూడా రసమయి వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా..తెలంగాణలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరాటం నువ్వా.. నేనా అన్నట్టు సాగుతుంది. ఎంపీ ఎన్నికల బరిలో అధిక సీట్లు సాధించే దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతుంది. మరోవైపు బీఆర్ఎస్ తమ నేతలు బైటకు వెళ్లకుండా కాపాడుకుంటూ, కాంగ్రెస్ వ్యూహాలకు, గట్టిగానే కౌంటర్ ఇస్తుంది.  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook