తెలంగాణలో పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట కల్లా 49.15 నమోదు అయింది. ఈ మేరకు ఈసీ ప్రకటన విడుదల చేసింది. కాగా తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. కాగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిస్తుంది.


పోలింగ్ ముగిసే సమయానికి ఓటింగ్ శాతం గతంలో కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశముందని ఎన్నికల అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఈ సారి ముఖ్యంగా మహిళా ఓటింగ్ శాతం గణణీయంగా పెరిగే అవకాశముందంటున్నారు. ఇదిలా ఉండగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరారు. మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు. అలాగే దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.