తెలంగాణలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి.. ఓటర్ దేవుళ్ల అనుగ్రహం కోసం నేతలు తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలో సరికొత్త పంథా అనుసరిస్తున్నారు. అన్నం తినిపించడం, స్నానం చేయించడం, షేవింగ్ చేయడం, ఇస్త్రీ చేయడం.. ఒకటేంటి ఓటర్లను ఆకర్షించడానికి ఏమైనా చేయడానికి నేతలు సిద్దమయ్యారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతల ప్రచార సరళిని ఒక్కసారి పరిశీలిద్దాం ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

*  భూపాలపల్లి ఎన్నికల ప్రచారంలో తాజా మాజీ స్పీకర్ మధుసూధనా చారీ ఓ సెలూన్ లో షేవింగ్ చేసి వార్తల్లో నిలిచారు
* ముషిరాబాద్ నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ నేత అజయ్ కుమార్ యాదవ్ రోడ్డుపై దోసెలు వేశారు.. ఇస్త్రీ చేసి జనాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు
* మహబూబ్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్ధి శ్రీనివాస్ గౌడ్ లేబర్స్ లో కలిసి కూలి పనుల్లో నిమగ్నమయ్యారు
* పెద్దపల్లి  టీఆర్‌ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణకు చిన్నారులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు
* ఇల్లందు నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్ధి కనకయ్య చిన్నారులకు స్నానం చేయించడం వంటి వినూత్న పనులు చేశారు
* ఆసిఫాబాద్ అభ్యర్థి కోవ లక్ష్మి మక్కజొన్న కంకులు కాల్చి ప్రజలను ఆకట్టుకున్నారు.
* జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అక్కా.. బాగున్నారా..? నేనెవరో తెలుసా? అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు


ఇవి ఉదాహరణలు మాత్రమే.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తమదైన శైలిలో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దీంతో పాటు డబ్బులు, సారా పంపిణీ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో తెగ పోస్టులు వస్తున్నాయి. ఇప్పటికే దీనిపై ఈసీకి పలు ఫిర్యాదులు అందాయి.