telangana polycet 2021 application last date extended: హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం తెలంగాణలో అన్ని ప్రవేశపరీక్షలకు సంబంధించిన దరఖాస్తు గడువు పొడిగిస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. అదే బాటలో తాజాగా తెలంగాణ పాలిసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును కూడా మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈనెల 18వ తేదీ వరకు ఎలాంటి లేట్ ఫీజు లేకుండా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కార్యదర్శి శ్రీనాథ్‌ మీడియాకు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి మరోమారు అవకాశం కల్పిస్తూ రూ.100 లేట్ ఫీజుతో ఈనెల 20 వరకు, మరో రూ.300 లేట్ ఫీజుతో ఈనెల 22 వరకు దరఖాస్తు (TS Polycet 2021 online application) చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని అన్నారు. 


Also read: TS LPCET 2021: టిఎస్ ఎల్‌పి సెట్ నోటిఫికేషన్ విడుదల


ప్రస్తుతానికి ఇంకా పాలిసెట్‌ పరీక్ష నిర్వహణ తేదీని (TS Polycet 2021 exams date) ఖరారు చేయలేదని, త్వరలో ఆ తేదీని వెల్లడిస్తామని, పరీక్ష నిర్వహించిన తర్వాత 10 రోజుల వ్యవధిలోనే  ఫలితాలు విడుదల చేస్తామని శ్రీనాథ్‌ తన తాజా ప్రకటనలో పేర్కొన్నారు.


Also read : TS EAMCET 2021: మరోసారి టిఎస్ ఎంసెట్ ఎగ్జామ్స్ దరఖాస్తు గడువు పెంపు


Also read: TS inter second year exams cancelled: తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దుపై అధికారిక ప్రకటన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook