Telangana Rain Updates: కురిసిన వాన కురిసినట్లే.. దాదాపు వారం రోజులుగా తెలంగాణ జిల్లాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. ఎండ ముఖం చూద్దామన్నా కనిపించట్లేదు. ఆకాశం మబ్బు పట్టి విరామం లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ఇంత భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న జనం.. వరుణుడు ఇకనైనా శాంతిస్తే బాగుండునని వాపోతున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే వర్షాలు తగ్గుముఖం పట్టేలా కనిపించట్లేదు. రాష్ట్రంలో ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధవారం (జూలై 13) అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలోని 12 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ (రూరల్), వరంగల్ (అర్బన్), జనగాం జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ 12 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.


మరో 8 జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఆదిలాబాద్,నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. హైదరాబాద్‌లో ఇవాళ ఆకాశం మేఘావృతమై ఉంటుందని తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.


నిన్న అర్ధరాత్రి వరకు కరీంనగర్ జిల్లా రామడుగులోని గుంది ప్రాంతంలో అత్యధికంగా 20.8 సెం.మీ, చొప్పదండిలోని ఆర్నకొండ ప్రాంతంలో 20.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా నిజామాబాద్ జిల్లా బోధన్ చిన్న మవందిలో 11.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. 



 


Also Read: Kadem project floods live updates: అన్ని గేట్లు ఎత్తేశాం.. కడెం ప్రాజెక్టుపై చేతులెత్తేసిన ఇరిగేషన్ అధికారులు


Also Read: Horoscope Today July 14th: నేటి రాశి ఫలాలు.. ఈ 4 రాశుల వారికి చంద్ర అనుగ్రహం కలుగుతుంది..



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook