Fruits Washed Away in Batasingaram Market: తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గత రెండు రోజులుగా హైదరాబాద్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్ శివారులోని బాటసింగారంలో ఉన్న పండ్ల మార్కెట్ కూడా భారీ వర్షాలకు నీటమునిగింది.టన్నులకొద్ది పండ్లు వాన నీటిలో కొట్టుకుపోయాయి. కళ్ల ముందే పండ్లు నీళ్లలో కొట్టుకుపోతుంటే రైతులు నిస్సహాయులుగా మిగిలిపోయారు. మార్కెట్లో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వాపోతున్నారు. తమను ఎవరు ఆదుకుంటారని ప్రశ్నిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదివరకు హైదరాబాద్ గడ్డి అన్నారంలో ఉన్న ఈ పండ్ల మార్కెట్‌ను ప్రభుత్వం బాటసింగారానికి తరలించింది. సరైన మౌలిక సదుపాయాలు కల్పించకుండానే రైతులను బలవంతంగా అక్కడికి తరలించారు. ఆ సమయంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. గడ్డి అన్నారంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించే ఉద్దేశంతో పండ్ల మార్కెట్‌ను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. మార్కెట్‌ను తరలించి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించట్లేదని రైతులు మండిపడుతున్నారు. వరదల్లో పండ్లు కొట్టుకుపోవడంతో తమకు తీరని నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మరోవైపు, హైదరాబాద్ సహా పలు తెలంగాణ జిల్లాలకు ఇవాళ కూడా భారీ వర్ష సూచన ఉంది. హైదరాబాద్‌లో అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. చాలాచోట్ల వర్షపు నీరు రోడ్లపైకి చేరి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మ్యాన్ హోల్స్ భయం వాహనదారులను వెంటాడుతోంది. భారీ వర్షానికి చాలాచోట్ల గంటలపాటు ట్రాఫిక్ జామ్ అవుతోంది. అటు ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.


Also Read: Monkeypox Cases: షాకింగ్.. మంకీపాక్స్ వ్యాధి సోకినవారిలో 98 శాతం మంది గే లేదా బైసెక్సువల్.. 


Also Read: Srisailam Dam:జూలైలోనే నిండిన  శ్రీశైలం డ్యాం.. ఇవాళ   గేట్లు ఓపెన్.. పర్యాటకుల సందడి  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook